31.7 C
Hyderabad
May 2, 2024 10: 44 AM
Slider ముఖ్యంశాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

#Hyderabad Meteorological Center

రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో మయన్మార్, బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలు తెలుగు రాష్ట్రాలను ఆవరించాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.మరోవైపు ఆవర్తన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆవర్తన ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుందని పేర్కొంది. ఐతే రాయలసీమపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. చెన్నై సమీపంలోని బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని, అది బలపడితే రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

Related posts

కిమ్స్ హాస్పిటల్ లో ఉచిత కంటి పరీక్షలు

Satyam NEWS

రివోల్ట్: కాలుష్యంపై చర్యలు తీసుకోని అధికారుల ఘెరావ్

Satyam NEWS

జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు

Bhavani

Leave a Comment