33.7 C
Hyderabad
April 29, 2024 00: 45 AM
Slider రంగారెడ్డి

రివోల్ట్: కాలుష్యంపై చర్యలు తీసుకోని అధికారుల ఘెరావ్

polution

కాలుష్యం కోరల్లో చిక్కుకుని చస్తుంటే పట్టించుకోని అధికారులు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో కాలుష్యంపై తనిఖీకి రావడం గ్రామస్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని కందివనం మొగిలిగిద్ద గ్రామ శివారులో కాలుష్యంతో చాలా కాలంగా అల్లాడుతున్నాయి.

ఫరూఖ్ నగర్ మండలంలోని పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారు. కందివనం ,మొగిలిగిద్ద ,గ్రామ శివారులలో కాలుష్యం వదులుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమలను మూసి వేసి వారిపై చర్యలు తీసుకోవాలని పలు మార్లు జిల్లా కలెక్టర్ కు ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు.

సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యంగా మారడంతో రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి అయిన  కెఎల్  రెడ్డి చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి పలు మార్లు నోటీసులు జారీ చేసింది.

అయితే ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంతో వెంటనే పరిశ్రమలను మూసి వెయ్యాలని పూర్తి విచారణ జరిపి తమకు రిపోర్ట్ ఇవ్వలని  తెలంగాణ ప్రభుత్వనికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. చెన్నై గ్రీన్  ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలతో  కాలుష్య పరిశ్రమలను తనిఖీలు చేసి వెళ్తున్న ఆర్డీఓ, అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డు పై గ్రామస్థులు నిరసన చెప్పారు.

Related posts

శభాష్ పోలీస్: ఫోన్ కొడితే వచ్చారు పట్టుకుపోయారు

Satyam NEWS

ల్యాంకో కార్మికులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సాయం

Satyam NEWS

ముదిమి వయస్సు లో..భూమి కోసం ఆరాటమైన పోరాటం… !

Satyam NEWS

Leave a Comment