38.2 C
Hyderabad
April 29, 2024 21: 46 PM
Slider వరంగల్

డాక్టర్ కె అనితారెడ్డికి ఎల్డర్స్ క్లబ్ సేవారత్న అవార్డు

#anitareddy

ఇంటర్నేషనల్ వయోవృద్ధుల దినోత్సవం హన్మకొండలోని రూరల్ కలెక్టర్ ఆఫీసు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు సేవారత్న అవార్డును డాక్టర్ కె అనితారెడ్డికి అందచేశారు. వృద్ధులకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గోపి ఈ అవార్డును అనితారెడ్డికి అందచేశారు.

ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. వృద్ధాప్యం ఎవరికి శాపం కాకూడదని ఆమె అన్నారు. దేశంలో సీనియర్ సిటిజన్స్ చట్టం అమలు జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. వృద్ధులకు సేవ చేయడం, వారికి అవసరమైన సహాయం అందించడం అందరూ కర్తవ్యంగా భావించాలని అనితారెడ్డి కోరారు. ఈ కర్తవ్యాన్ని తాను అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్నట్లు అనితారెడ్డి తెలిపారు. వృద్ధులకు, అనాథలకు సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉందని అనితారెడ్డి తెలిపారు.

Related posts

అభివృద్ధి అవినీతి గొడవలతో మల్హర్ మండలంలో 144 సెక్షన్

Satyam NEWS

ఘనంగా సంతోషి మాత అమ్మవారికి పూజలు

Satyam NEWS

విక్రమ సింహపురి యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ వర్థంతి

Satyam NEWS

Leave a Comment