34.7 C
Hyderabad
May 5, 2024 00: 42 AM
Slider పశ్చిమగోదావరి

రూ.21.1 కోట్లతో ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి

#governor

ఏలూరు రైల్వే స్టేషన్ లో 21.1కోట్ల రూపాయలతో చేపట్టనున్న  స్టేషన్  అభివృద్ధి పనులకు  రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం శంకుస్థాపన చేసారు. ఉదయం విజయవాడ నుంచి ఏలూరు చేరుకున్న గవర్నరు కు జిల్లా కలెక్టర్ , జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ నుండి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. అనంతరం ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, డిఐజి జి. వి. జి అశోక్ కుమార్ , ఎస్పీ మేరీ ప్రశాంతి, రైల్వే డి ఆర్ ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, సీనియర్ డి సి ఎం వావిలాలపల్లి రబాబు, సీనియర్ డిఈఎన్ ఎస్. వరుణ్ బాబు, సీనియర్ డి ఓ ఎం నరేంద్ర వర్మ, సీనియర్ డి. ఎస్. సి. వల్లేశ్వర్ బాబ్జి తొక్కల,  ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, మాజీ ఎంపీ మాగంటి బాబు, ప్రభృతులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ లో భారీ ఎత్తున హవాలా సొమ్ము

Satyam NEWS

నోటీసులకు భయపడం ఉద్యమాన్ని ఆపం: ఏఐటియుసి

Satyam NEWS

మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన పాస్టర్

Satyam NEWS

Leave a Comment