40.2 C
Hyderabad
April 29, 2024 17: 43 PM
Slider మహబూబ్ నగర్

చిరుత మృతదేహం లభ్యం: ముగ్గురి అరెస్టు

#forest

చిరుతపులి దంతాలు, గోరును విక్రయిస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్నట్లు డిఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. ఆదివారం మన్ననూర్ ఈసిసి సెంటర్ నందు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత నెలలో ఇంఫార్మర్ల ద్వారా గోర్లు, దంతాలు అమ్మకానికి కుదిరినట్లు సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ మఫ్టీ సిబ్బందితో వలపన్ని బేరసారాలు కుదుర్చుకుని అమ్మకానికి సిద్దం కాగా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామ సమీపంలోని దాభా వద్ద పదర మండలం ఇప్పలపల్లికి చెందిన నరేష్, బోయిన చిన్న ఆంజనేయులు రాగా వారిని  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, ఒక గోరు రెండు దంతాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నాలుగు నెలల క్రితం మద్దిమడుగు రేంజ్ పరిధిలోని సోమ చెల్క బీట్, క్యాంపు 139, సోమచెల్క సెక్షన్ వద్ద చిరుతపులి చనిపోయి ఉండగా దాని యొక్క ఒక గోరు, రెండు కోర దంతాలు సేకరించమని నిందితులు తెలిపారని అన్నారు.

ఆ గ్రామంలో మరింత తనిఖీలు నిర్వహించగా గుర్రం ఆంజనేయులు, మండ్లి ఆంజనేయులు వద్ద మరొక గోరు, రెండు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అడవిలో దొరికిన చిరుత కళేబరాలను సేకరించి ల్యాబ్ కు పంపి, వారి పై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్సినట్లు తెలిపారు. వన్యప్రాణులను  చంపిన లేదా వాటి యొక్క ఏ పదార్థమును అమ్మ చూసిన, కొనుగోలు చేసిన చట్టరీత్యా నేరమని , తీవ్రమైన శిక్షకు గురవుతారని అన్నారు.  ప్రభుత్వం కోట్లాది రూపాయలతో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటుండగా కొందరు డబ్బులకు ఆశపడి ఇలాంటి సంఘటనలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. 

ఎక్కడైనా వన్యప్రాణుల మృతదేహం కనిపించినట్లయితే వెంటనే సంబంధిత అటవీ అధికారులకు తెలుపాలని కోరారు.  వన్యప్రాణుల మాంసం గాని లేదా గోర్లు, దంతాలను అమ్మే వ్యక్తుల యొక్క సమాచారం తెలియజేసినచో వారికి తగు పారితోషికం ఇస్తామని, వారి వివరాలను రహస్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.  వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, వన్యప్రాణులను అటవీ సంరక్షణను కాపాడుటకు సహకారం అందించాల్సిందిగా ప్రజలను జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి కోరారు.

నిందితుల వివరాలు

1. మాడబోయిన చిన్న ఆంజనేయులు, తండ్రి నర్సయ్య, వృత్తి డిప్యూటీ సర్పంచ్, గ్రామము మద్దిమడుగు , వయసు 37, కులం బీసీ ముదిరాజ్

2. రాట్లవత్ నరేష్ తండ్రి బాలు, గ్రామం ఇప్పల పల్లి, వయసు 25, కులం షెడ్యూల్ తెగ లంబడ, వృత్తి వ్యాపారం.

3. గుర్రం ఆంజనేయులు తండ్రి గుర్రం మల్లయ్య , గ్రామం మద్దిమడుగు, వయసు 57, కులం: బిసి పద్మ శాలి, గ్రామ పంచాయతి వర్కర్,

4.మండ్లి చిన్న ఈదైయ్యా ( పరారీలో ఉన్నాడు)

అమ్రాబాద్, సత్యం న్యూస్

Related posts

తిరుమలలో రేపు కార్తీక వన భోజనోత్సవాల‌కు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

గడప గడపకు చేరిన టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు

Satyam NEWS

తెలంగాణ బాటలో నడుస్తున్న ఆంధ్ర ఆర్టీసీ

Satyam NEWS

Leave a Comment