42.2 C
Hyderabad
May 3, 2024 16: 37 PM
Slider ప్రత్యేకం

భారత్ లో ఎమర్జన్సీ విధించి నేటికి 46 ఏళ్ళు…!

#IndiraGandhi

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా పిలుచుకునే ఎమర్జెన్సీకి నేటికి 46 ఏళ్లు అయింది.1975 జూన్ 25న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 352(1)లోని అంతర్గత అత్యవసర పరిస్థితి నిబంధన వినియోగించుకుని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు.

21 నెలల పాటు నిర్విరామంగా కొనసాగిన ఎమర్జెన్సీకి 1977 మార్చి 21న తెరపడింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ తన ప్రత్యర్థులను జైలుకు పంపడం, ఎన్నికలు వాయిదా వేయడం, పత్రికలను నియంత్రించడం లాంటివి చోటుచేసుకున్నాయి.

దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఎమర్జెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని జైలుకు పంపడం లాంటి ఘటనలు తీవ్ర విమర్శలు దారి తీశాయి.

ఎమర్జెన్సీ విధించడానికి కారణాలేంటి?

కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడం, పలు రాష్ట్రాల్లో నాటి కాంగ్రెస్ సీఎం అవినీతి, అక్రమాల మీద ఉద్యమాలు ఊపందుకోవడం, ఇందిరాగాంధీ పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హురాలిగా తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం లాంటి అనేక ఘటనలతో అధికారాన్ని కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ దిశగా ఇందిర అడుగులు వేసే పరిస్ధితి వచ్చింది.

గ‌త చ‌రిత్ర‌ను తెలుసుకోవ‌డం ప్ర‌తీ ఒక్క‌రి క‌ర్త‌వ్య‌మంటోంది స‌త్యం న్యూస్.నెట్.

ఎం.భరత్ కుమార్, స‌త్యం న్యూస్.నెట్

Related posts

మధిర మండలంలో కొట్టుకుపోయిన మాటూరు బ్రిడ్జి

Satyam NEWS

టర్కిష్ సూఫీ సంగీత ప్రదర్శన ఫిబ్రవరి 3న శిల్ప కళా వేదికలో

Bhavani

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రాత్రి కర్ఫ్యూ

Satyam NEWS

Leave a Comment