27.3 C
Hyderabad
May 10, 2024 09: 27 AM
Slider వరంగల్

ఉపాధి హామీ కూలీలపై కనికరం చూపని కేంద్ర ప్రభుత్వం

#porika

ఉపాధి హామీ కూలీలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్లుగా ఉందని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ అన్నారు. ములుగు మండలంలోని భూపాల్ నగర్ గ్రామంలో నేడు ఆయన ఉపాధి కూలీలతో ముచ్చటించారు. అనంతరం వారికి అరటిపళ్ళు అందజేశారు. అనంతరం గోవింద్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందులాగా పనిముట్లు సమకూర్చడం, కూలీలకు త్రాగడానికి మంచినీరు, ఎండలో విశ్రాంతి తీసుకోవడానికి టెంటు, మహిళా కూలీలకు ఇతర సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు.

కేవలం 275 రూపాయలు వేతనం మాత్రమే ఇచ్చి పనివేళలు పెంచి మౌలిక వసతులు కల్పించకుండా ఉపాధి హామీ కూలీల పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం కొంతమంది కూలీలు సంవత్సరం క్రితం ఉపాధి హామీ చేసిన పనులకు డబ్బులు రాలేదని ఆయన దృష్టికి తీసుకురాగా APO గారికి తక్షణమే ఫోన్ చేసి వివరణ కోరారు. జాబు కార్డు, బ్యాంకు పాస్ బుక్ తీసుకువస్తే గత రికార్డులు పరిశీలించి డబ్బులు త్వరలో పడేవిధంగా చేస్తారని APO  హామీ ఇచ్చారు.

Related posts

సంబరాలకు బదులు సహాయం చేయండి

Satyam NEWS

ట్రాజెడీ: ముద్దులొలికే ఈ పాప ఇక లేదు

Satyam NEWS

నరసరావుపేట ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment