36.2 C
Hyderabad
April 27, 2024 21: 59 PM
Slider ప్రత్యేకం

విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం

#website

సిబిఐటి – గూగుల్  డెవలపర్ స్టూడెంట్ క్లబ్  మరియు స్టూడెంట్ బ్రాంచ్ –  ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్  కలిసి ‘  టెక్ – ట్రెక్స్’  అనే కార్యక్రమం నిర్వహించారు. కెరీర్ అభివృద్ధిలో వివిధ అంశాలు గురుంచి స్టుమాగ్జ్ వ్యవస్థాపకుడు, సిఈఓ చరణ్ లక్కరాజు  ముఖ్య అతిధి గా విచ్చేసి  ప్రసంగించారు. కొత్త ప్లేస్‌మెంట్ అవకాశాలు,  కెరీర్ డెవలప్‌మెంట్‌లో సరికొత్త ట్రెండ్‌లు, సాంకేతికతల గురించి వివరించారు. 

మరొక ముఖ్య అతిధి  బీయింగ్ జీరో వ్యవస్థాపకుడు సందీప్ కుమార్  ప్రోగ్రామింగ్ మరియు సాంకేతిక పురోగతి ప్రాముఖ్యతను  చెప్పారు.  తర్వాత, వెబ్ డెవలప్‌మెంట్ మీద పోటీ ప్రారంభమైంది. పాల్గొనేవారికి వారి వెబ్‌సైట్‌ల కోసం మార్గదర్శకాలు అందచేశారు. సైట్‌లను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి వారికి పరిమిత సమయం ఇవ్వడం జరిగింది.  పాల్గొనేవారు వారి వెబ్‌సైట్‌లను రూపొందించడంలో వారి సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించారు.

పోటీ ముగింపులో, న్యాయనిర్ణేతలు ప్రతి వెబ్‌సైట్‌ను మూల్యాంకనం చేసి విజేతలను ప్రకటించారు. వారి డిజైన్, కార్యాచరణ మొత్తం వినియోగదారు అనుభవం ఆధారంగా అగ్ర వెబ్‌సైట్ సెలక్ట్ చేశారు. వెబ్ డెవలప్‌మెంట్‌లో విలువైన జ్ఞానాన్ని ప్రయోగాత్మక అనుభవాన్ని పొందిన హాజరైన వారికి ఈవెంట్ చాలా ప్రయోజనకరంగా వున్నది అని హాజరైన విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఫ్యాకల్టీ అడ్వైజర్ గూగుల్  డెవలపర్ స్టూడెంట్ క్లబ్ జి షణ్ముఖి రమ, ప్రొఫెసర్ వై రమాదేవి, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కూలీల వినతి

Satyam NEWS

విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

Satyam NEWS

నటుడుగా ఇరగదీయబోతున్న వినాయక్

Satyam NEWS

Leave a Comment