31.7 C
Hyderabad
May 2, 2024 09: 08 AM
Slider ప్రత్యేకం

రెండు దశాబ్దాల ధిక్కార పాట ఏపూరి

EpuriSomanna1

మాట నేర్చిన ఆదిమానవుడి నుంచి పాట ఉంది. పాట మానవాభివృద్ధి పరంపరలో మనిషితో పాటుగా ఎన్నో ఆటు-పోటులను ఎదుర్కొంటూ మరెన్నో ఎత్తుపల్లాలను చవిచూస్తూ వస్తున్నది. పుట్టుక, జీవితం, చావులో కూడా పాట మనతో పాటుగానే మమేకమై తన ఉనికినిచాటుకుంటున్నది.

పాటకున్న చరిత్ర ఒక ఎత్తైతే పాటగానికి ఉన్న జీవితం మరొక్క ఎత్తు. పాట పల్లకిలో ఊరేగుతున్న వేళ. గాయకుడు ఆకలితో పోరాడుతున్న వైనం మనకు సాక్షత్కరిస్తుంది. పాట పోరు జరుపుతున్నప్పుడు గొంతు మూగదైన వ్యతిరేక సందర్భాలు ఉంటాయి.

పాటనే ఊపిరిగా, జనం కష్టాల కన్నీటిని తుడుస్తూ పిడికిలి బిగించే చైతన్యాన్ని రగిలించే గాయకులు తక్కువ మంది ఉంటారు. అలాంటి అరుదైన గాయకుల్లో మనకు వినిపించే గొంతుక ఏపూరి సోమన్న. అవమానాలు, ఆకలిపేగుల కేకలు, సబ్బండ జాతుల కన్నీళ్లే కథాంశంగా ఏపూరి పాట గుండెల్ని కదిలిస్తుంది.

చైతన్య రథానికి చక్రం సోమన్న పాట

మన గొంతుక వినపడుతున్నదనే ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆ ధైర్యంతో ఏపూరి పాట జోలపాటలా మారుతుంది. కణకణ మండే గుండెల చైతన్య జ్వాల అవుతుంది. తిరుగుబాటు చైతన్య రధానికి ఏపూరి గొంతుక చక్రం లాంటిది. స్వేచ్ఛా వాయువు పీల్చే స్పృహను కలిగించే అరుదైన గాయకుడు ఏపూరి.

అంటరాని వాడలో పుట్టిన ఏపూరి నేడు జ్ఞాన దివిటిని హత్తుకుని రాజ్యాధికారాన్ని ముద్దాడాలనుకుంటున్నాడు. ఏపూరి వెలిశాల గ్రామంలో తిరుమలగి(తోండ)నాటి ఉమ్మడి నల్గొండ నేటి సూర్యాపేట జిల్లా వాసి. ఏపూరి పుట్టుక నేపధ్యం ఉద్యమాలను కన్న పురిటిగడ్డ మాదిగ గూడెమే గానీ ఈ మూలాలతో మరింత భౌగోళికతను తనకు వారసత్వం గా ఈ ప్రాంతమంతా ఆక్రమించి ఉన్నడు.

చైతన్య గీతాల సూరీడు సోమన్న

సాయుధ రైతాంగ పోరాటమేమి, మలి-తొలి దశల తెలంగాణోధ్యమేమి, బహుజన ఉద్యమాల బాటల్లో కదంతొక్కిన తొలి పాదాల జాడల్లో నేడు ఏపూరి కన్పిస్తాడు. దొడ్డి కొమురయ్య, షేక్ బందంగీ, చిట్యాల (చాకలి)ఐలమ్మ,  భీంరెడ్డీ నర్సింహారెడ్డి,మారోజు వీరన్నల ప్రాభావిత కథలకు గుర్తు ఏపూరిసోమన్న పాట.

స్వీయప్రయోజనం ఆశించని ఏకైక గాయకుడై తన జీవితాన్ని సబ్బండ కులాలకు పాటగా అంకితమయ్యాడు. నాల్గున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షగా నెలకొన్న తెలంగాణ రాష్ట్రోదయంలో అణగారిన, బడుగు-బలహీన మైనార్టీ ప్రజల గొంతుకు నొక్కివేయబడిన వేళ నిరంకుశంత్వంపై రగిలిన మహోజ్వలమైన పాట ఏపూరి ఎవనిపాలైందిరో తెలంగాణ.

ఉద్యమాల బాటలో సోమన్న పాట

బందిఖానలో బంధించబడిన అంతకుఅంతగా జనాల నాడిలోకి సొచ్చుకుపోయిన పాట ఈయన సొంతం. తొమ్మిదిన్నరకోట్ల తెలుగు ప్రజల నాలుకల్లో విన్పించే సహజగానం ఏపూరి సోమన్న.

తెలుగు సమాజంలో ఇరవైయేండ్ల నుండి నెలకొన్న ఆయా క్లిష్టమైన ఉద్యమాలలో అది విప్లవోధ్యమంగావచ్చు దళితోధ్యమంగావచ్చు బహుజనోధ్యమంకావచ్చు మలిదశ తెలంగాణోధ్యమంకావచ్చు ఏపూరిపాటనే ప్రధాన ఆకర్షణ. ఎన్నో తరాలుగా సామాన్య ప్రజలకు జరుగుతున్న మోసాలను అధ్యయనం చేసిన సోమన్న కులపీడన పోరులో స్వీయకులాల దోపిడిలో ముందుండి పాటల బల్లెమై గర్జించాడు.

ఇవ్వాళవిశ్వమంతా వ్యాపించిన మహాజనుల జాతి గీతాన్ని(మాదిగ మహవీరులారా) ఆలపించిన ప్రియస్వరం ఏపూరి. అందుకే డాక్టర్ ఏపూరి సోమన్నగా ఆవిష్కరించబడ్డాడు. ఒకతరపు జీవితాలను కోల్పోయాక కొన్ని పెయిడ్ ఉద్యమాల రంగు వెలిసిపోయినాక  జ్ఞానప్రకాశితమైన బుద్దుని బాటలో పయనమైయ్యే తరుణాన్నీ ఆస్వాదించుకున్న గాయకుడు ఏపూరి సోమన్న.

పూలే- అంబేద్కర్ వాదాలను కడుపుల పేగుల ఆకలి బాధలతోనైనా ఊరు-వాడలకు పంచాలనుకుని కంకణబద్దుడై తెలంగాణ ప్రాంతంలో జ్ఞానయాత్ర పేరిట ఐదు వందల మండలాలను పాటగా అఆఇఈ అంటూ చుట్టివచ్చిన పాటల సూర్యుడు ఏపూరి.

జల్ఖారీబాయికోరే, సావిత్రిబాయిపూలే కలల వారసత్వంగా పాటగా ఈ ప్రాంతంలో మొలిచిన మహావృక్షం  అనడంలో ఎటువంటి సందేహం లేదు. కులదొంతరలో, మతోన్మాద యావలో ధ్వంసమైపోతున్న మానావాళి పక్షాన పాటై నిలిచిన పోరుశిఖరం.

యావత్ భారతమేగాక ప్రపంచిక మానవాభివృధ్దిని కాంక్షించిన మానవీయత రాగం, భూస్వామ్య, సామ్రాజ్యవాద పిడివాదంపై ఉక్కుపిడికిలై కదంతొక్కిన పోరుగొంతుకై ప్రపంచీకరణలో మంటగల్సిపోతున్న మానవత్వాన్నీ తట్టిలేపుతున్న మాణవీయ స్వరాల జానపదులమేటి ఆట-పాటగాడై అనుక్షణం పీడుతులపక్షం వహించివున్న పూలే-అంబేద్కర్ వారసత్వ సంపదగా నిలిచివున్నోడు.

దండోరా డప్పల మోతల్లో రగిలిన పెనుమంటలై బహుజన శ్రామిక కులాల హక్కుల సాధనకై ఆకలి పోరాటాలను చవిచూసి రాజ్య హింస పాలనపై ఎక్కుపెట్టిన బాణమోలే పాటల ఫిరంగీని మ్రోగించిన బహుజన యుద్దనౌక.”పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ” అని నేర్పించిన  అంబేడ్కర్ ఆశసాధకుడిగా మనముందున్న ఇరవైయేండ్ల పాటల  సూర్యుడికీ  జన్మదిన శుభాకాంక్షలు.

అవుట రాజశేఖర్ కొల్లాపూర్

Related posts

రంజాన్ మాస సందర్భంగా పేద ముస్లింలకు బట్టల పంపిణీ

Satyam NEWS

Analysis: అమెరికాతో భవితవ్యం-భాగస్వామ్యం

Satyam NEWS

ఇన్ సైడర్ ట్రేడింగ్: జగన్ ప్రభుత్వ వాదన కొట్టేసిన సుప్రీంకోర్టు

Satyam NEWS

Leave a Comment