40.2 C
Hyderabad
April 28, 2024 15: 12 PM
Slider విజయనగరం

తెలిసి తప్పు చేస్తే.. ఊరుకునేది లేదు

#ARPolice

ఏర్ వింగ్ కు జిల్లా పోలీసు బాస్ వార్నింగ్…! ఇన్టెన్షనల్ గా ఎవ్వరైనా తప్పు చేస్తే…చర్యలు తీసుకోవడంలో వెనుకాడమని విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఎస్పీ దీపికా అన్నారు. విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్ లి నిర్వహించిన సెరిమోనియల్ పరేడ్ కు జిల్లా ఎస్పీ ఎం.దీపిక  హాజరై, ఆర్మ్డ్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రతీ శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవియన్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బందికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి వస్తే, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, అంకిత భావంతో నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం, ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి జిల్లా ఎస్పీ అక్కడికక్కడే చర్యలు చేపట్టి, సిబ్బంది సంక్షేమానికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఆర్ ఐలు గోపాల నాయుడు, రమణమూర్తి, ఆర్ఎసైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నిరుద్యోగులను నిలువునా ముంచిన టీఆర్ఎస్ పార్టీ

Satyam NEWS

కడపలో స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్

Satyam NEWS

వంద శాతం గ్రౌండింగ్ కావాలి

Murali Krishna

Leave a Comment