రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను కడప జగతి మాంటిస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహిస్తున్నామని విద్యాసంస్థల ఛైర్మన్ లేవాకు నితిశ్ అన్నారు. కడప నగరం లో జరిగే ఈ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో మొత్తం లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందని, వివిధ జిల్లాల నుంచి చెస్ పోటీల్లో పాల్గొనడానికి కడప కు వచ్చారన్నారు. విద్యాసంస్థల ఛైర్మన్ నితిశ్ మీడియా తో మాట్లాడుతూ ఆల్ కడప చెస్ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహకారం తో చెస్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నూతనంగా ఈ ఏడాది ప్రారంభించిన మాంటిస్సోరీ సిలబస్ ను విద్యార్థి , విద్యార్థినులకు నేర్పిస్తామన్నారు. అన్నీ స్కూల్ లలో లాగా విద్య ను కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకునేందుకు వీలుగా అన్నీ వసతులు కల్పిస్తామన్నారు.
previous post