42.2 C
Hyderabad
May 3, 2024 17: 05 PM
Slider నల్గొండ

పేద ప్రజలకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి

komatireddy 241

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల ను దృష్టిలో పెట్టుకొని 3వ వార్డులో ఇంటింటికి నిత్యావసర సరుకులను చిట్యాల మున్సిపల్ చెర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి పంపిణీ చేశారు. బియ్యం, ఆరు రకాల కూరగాయలు,పప్పులు,చక్కెర,మంచి నూనె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలుగా పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో కూడా భౌతిక దూరం పాటించాలి మస్కులు ధరించాలని తెలిపారు ఇండ్లలో నుంచి బయటకు రాకుండా కృషి చేయాలని కోరారు. కరోనా వైరస్ నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లి సత్తయ్య, జగిని బిక్షం రెడ్డి బొబ్బలి శివశంకర్ రెడ్డి, కోమటిరెడ్డి అమరెందర్ రెడ్డి, వరకాంతం నరేందర్ రెడ్డి, ఇమ్మడి వెంకన్న, గంట శ్రీనివాస్ రెడ్డి ,మన్నెం సైదులు,దాసరి నర్సింహా,నూనె శ్రీక్రాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల కఠిన శిక్ష

Satyam NEWS

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇజ్రాయెల్ లో ప్రయత్నాలు

Bhavani

అమిత్ షా తో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ

Satyam NEWS

Leave a Comment