39.2 C
Hyderabad
May 3, 2024 12: 31 PM
Slider విజయనగరం

ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం

#Kolagatla

సీఎం జ‌గ‌న్..దేశానికే మార్గదర్శిగా నిలిచారని విజయనగరం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ  ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. న‌గ‌రంలోని తన నివాసం వద్ద రేషన్ సరుకుల పంపిణీ వాహనాల కు  జెండా ఊపి, ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టి సీఎం జ‌గ‌న్ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. మొత్తం 41 వాహనాల ద్వారా నగరంలో రేషన్ కార్డుల లబ్దిదారులు  అందరికీ నిత్యావసర సరుకులు అందజేయనున్నారని అన్నారు.

పేదల గడప వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించే బృహత్తర కార్యక్రమం అని అన్నారు. రేషన్ షాపుల వద్ద క్యూలైన్ల కు స్వస్తి పలికి, తూకాలలో అక్రమాలకు, మోసాలకు ఇక చెక్ అని అన్నారు. మొబైల్ వాహనాలతో రేషన్ కార్డు లబ్ధిదారుల ఇంటివద్దనే, వారి కళ్ల ఎదుట నే సీల్డ్ బ్యాగ్ తెరచి సరైన తూకం తో వాలంటీర్ ద్వారా రేషన్ సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు.

నిత్యవసర సరుకులు పక్కదారి పట్టకుండా అన్ని మొబైల్ వాహనాలు లో జిపిఎస్, ఆన్లైన్ ట్రాకింగ్ వీలుగా ప్రతి సంచికి యూనిక్ కోడ్ ఉంటుందన్నారు. వెనుకబడిన వర్గాల వారికి ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో 60 శాతం రాయితీపై వాహనాలను అందజేయడం జరిగిందన్నారు.

వాహన విలువ 5.81 లక్షలు కాగా, ఇందులో 3,48,600 రాయితీ వర్తిస్తుందని, ఇందులో మాత్రమే వాహన లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహన నిర్వహణకు, చోదకుడు, సహాయకుడి కి కలిపి నెలకు 16,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో  ఎమ్మార్వో ప్రభాకర్ రావు, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ప్రసాద్ రావు, ఏఎంసీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరపాలక అధ్యక్షులు ఆశపు వేణు, సీనియర్ సిటిజన్ విభాగం జిల్లా నాయకులు కె వి కృష్ణారావు,

లోకల్ గవర్నెన్స్ జాతీయ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, ఆయా జోన్ ఇన్చార్జిలు సంగంరెడ్డి బంగారు నాయుడు, అల్లు చాణక్య, యవర్ణ కుమారస్వామి, కాళ్ళ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ హామీ

Satyam NEWS

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

జేఈఈ (మెయిన్), నీట్ “కోటా” గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

Leave a Comment