30.3 C
Hyderabad
March 15, 2025 11: 04 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ సర్కిల్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు

#Kollapur CI

ముస్లిం సోదరులకు కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం న్యూస్ తో మాట్లాడుతూ సోమవారం కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులతో ఇంటి దగ్గర రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఈద్గాల దగ్గరికి ఎవ్వరు వెళ్లవద్దని ఆయన కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఒకరిని ఒకరు కలుసుకోకుండా దూరంగా ఉండి ఈద్ శుభాకాంక్షలు తెలుపు కోవాలని సిఐ బి.వెంకట్ రెడ్డి అన్నారు.

కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని ఈద్ ను జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించాలని అన్నారు. ముస్లిం సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Related posts

ఈ నెల 9 న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభo

mamatha

తిరుపతిలో కరోనా లాక్ డౌన్ అమలు నామమాత్రమే!

Satyam NEWS

దేవాలయాలపై దాడులకు ధ్వజమెత్తిన పీఠాధిపతులు

Satyam NEWS

Leave a Comment