26.7 C
Hyderabad
May 3, 2024 09: 58 AM
Slider ముఖ్యంశాలు

టీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన ఈటల రాజేందర్

#EtalaRajendar

మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తప్పుకున్నారు. బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకున్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆయన తో బాటు టీఆర్ఎస్ నాయకులు  ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా పార్టీ నుంచి రాజీనామా చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా ఈటల రాజీనామా చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో  ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్‌… ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు.

కుట్రలు కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చని… అంతిమవిజయం ధర్మానిదేనన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది అవమానాలు ఎదుర్కొంటున్నారని, వారిలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు కూడా ఒకరని ఈటల ఆరోపించారు.

ఐదేళ్ల క్రితం నుంచే అవమానించడం ప్రారంభించారని… మంత్రినైన తనకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు.

ఏం జరుగుతుందో తెలుసుకోకుండా… తన వివరణ తీసుకోకుండానే మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేశారని ఈటల వాపోయారు.

తెలంగాణ ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నిసార్లు ఆదేశించినా రాజీనామా చేశానని…. తనకు పదవులు తృణప్రాయమన్నారు. ఎన్నికల బరిలో దిగిన ప్రతిసారి.. తెలంగాణ చిత్రపటంపై గర్వపడేలా గెలిచివచ్చానని చెప్పారు.

Related posts

మోర్బీ బ్రిడ్జి కూలిన సంఘటనపై ప్రభుత్వం నోరుమెదపదేం?

Satyam NEWS

తిరుపతి అసెంబ్లీ సీటుపై జనసేన ఆసక్తి: బరిలో హరిప్రసాద్

Satyam NEWS

ప్రతి పైసా సీఎం చేతిలోనే

Murali Krishna

Leave a Comment