31.2 C
Hyderabad
May 3, 2024 00: 48 AM
Slider ప్రత్యేకం

ఫియర్ సైకోసిస్: పాపం ఎలాంటి ఈనాడు ఎలా అయిపోయిందో?

ramojeerao

మీడియాలో చాలా ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందని ఈనాడుకు పేరు. వార్తలు విశేషాల సంగతి ఎలా ఉన్నా సిబ్బంది విషయంలో, వారి జీతాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో ఈనాడు సంస్థలు శ్రద్ధ చూపిస్తాయి. దాదాపు అన్ని పత్రికలూ, అన్ని ఛానెళ్లూ క్షేత్ర స్థాయిలో రిపోర్టర్లను వార్తలు అడగడం మానేసి ఎడ్వర్టయిజ్ మెంట్లు అడుగుతున్నాయి.

ఎడ్వర్టయిజ్ మెంట్ల కు టార్గెట్లు పెడుతున్నాయి. కొన్ని సంస్థలు అయితే సంబంధిత ఏరియా నుంచి నెలకు ఇంత కట్టాలి అంటూ రిపోర్టర్లపై వత్తిడి తెస్తుంటాయి. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు (ఎక్రిడిటేషన్ కార్డు) సౌకర్యం ఉన్న మీడియా సంస్థల డిమాండ్లు అయితే మరింత ఎక్కువగా ఉంటాయి.

ఇవన్నీలేకుండా ఈనాడు సంస్థల్లో చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చునని అనుకునేవారు కానీ ఇప్పుడు ఈనాడు సంస్థ కూడా క్రమంగా అన్ని సంస్థల దారిలోకే వచ్చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈనాడు సంస్థ నుంచి కొత్తగా ఈటీవీ భారత్ యాప్ ఒకటి విడుదల అయింది. సాధారణంగా ఈనాడు ఏ రూపంలో వచ్చినా పాఠకులు, వీక్షకులు ఆహ్వానిస్తారు. ఎందుకో తెలియదు కానీ ఈటీవీ యాప్ మాత్రం అంతగా ఆదరణకు నోచుకోవడం లేదులా ఉంది.

దాంతో క్షేత్ర స్థాయిలో ఉండే ప్రతి రిపోర్టరు దానికి చందాదారులను చేర్పించాలని టార్గెట్లు పెట్టారు. ఈటీవీ భారత్ లింక్ అందరూ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలి. దీనికి క్షేత్ర స్థాయిలో ఉన్న వారికి టార్గెట్ పెట్టారు. వారికి ఒక కోడ్ నెంబర్ ఇస్తారు. వారు డౌన్ లోడ్ చేయించారా లేదా అని చెక్ చేయడానికి. పాపం ఈనాడు, ఈటీవీ రిపోర్టర్లు ఎండనకా వాననకా తిరుగుతున్నారు. అందరిని బతిమిలాడుకుంటున్నారు. ఈటీవీ భారత్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్టు చేసుకుంటున్నారు. పాపం… ఎలాంటి ఈనాడు ఎలా అయిపోయిందో……?

Related posts

‘ఇగురం’ గంగాడి సుధీర్ ని అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

రెండు రాష్ట్రాల అసెంబ్లీకి మోగిన నగారా

Satyam NEWS

28 లక్షల తో కంటోన్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఆధునికీకరణ…!

Satyam NEWS

Leave a Comment