31.2 C
Hyderabad
May 2, 2024 23: 34 PM
Slider మహబూబ్ నగర్

వివాహ వేడుకలలో పాల్గొన్న సీనియర్ నేత జూపల్లి

jupally marriage

మాజీ మంత్రి, టీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలంలో నేడు విస్తృతంగా పర్యటించారు. చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూర్ గ్రామంలో జరిగిన వివిధ శుభకార్యాలలో ఆయన పాల్గొన్నారు.

కొప్పునూర్ గ్రామంలో వడ్డే వెంకటేశ్వర్లు కుమార్తె వివాహమహోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వివాహ వేడుకలో పాల్గొన్న జూపల్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అదే విధంగా తగరం మైబూసి కుమారుడి వివాహ శుభకార్యంలో కూడా జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం గ్రామ టీఆర్ ఎస్ పార్టీ నాయకులతో, ప్రజలతో కలిసి వివిధ అంశాలపై ముచ్చటించారు. మాజీ మంత్రి జూపల్లి తో బాటు ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

వీఆర్ఎ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Satyam NEWS

వాగులో చిక్కుకున్న అన్నదాత

Satyam NEWS

జ‌ర్న‌లిస్ట్  పిల్ల‌ల ఫీజు త‌గ్గింపుపై  జీఓ ఉంటే చూపించండి..!

Satyam NEWS

Leave a Comment