38.2 C
Hyderabad
April 29, 2024 21: 04 PM
Slider ఖమ్మం

ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తాం

#Ponguleti Srinivasa Reddy

ఎన్నికలొస్తున్నాయ్… టూరిస్ట్ లొస్తారు జాగ్రత్త అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజలకు సూచించారు. జూలురుపాడులో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలతోనే తాను మమేకమై ఉన్నానని….వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని తెలిపారు.

కానీ అధికారం ఉన్న నాయకులెవ్వరూ ఇంతవరకు ప్రజలు ఎలా ఉన్నారు… వారి సార్థక బాధలు ఎంటి అని తెలుసుకునే కనీస ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి వస్తారని… ఎవరు మనవాళ్లో… ఎవరు పరాయి వాళ్లో ప్రజలు గుర్తించాలని కోరారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని దీవించడానికి సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ళు…. రూ.500కే వంటగ్యాస్… ఏడాదిలోనే రెండు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం…. గిరిజనులకు పోడు పట్టాలు… రైతు సోదరులకు రూ. రెండు లక్షల రుణమాఫీ…. రూ. 4వేల పెన్షన్ సౌకర్యం తదితర హామీలన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తామని మరోమారు స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్ జిమ్మిక్కులు ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎద్దెవా చేశారు. బీఆర్ఎస్ కు పోయే కాలం… కాంగ్రెస్ కు మంచి కాలం రావడానికి కేవలం మూడు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బాణోత్ విజయబాయి, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకట్ రెడ్డి,

ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్, పాలెపు భద్రయ్య, భ్యూ అమ్మ, మద్దిశెట్టి వంశీ, బొడ్డు కృష్ణయ్య, పోతురాజు నాగరాజు, ముత్తినేని రామయ్య, లేళ్ల గోపాల రెడ్డి, పప్పులు నరసింహారావు, బాణోత్ హరి, బాణోత్ ప్రసాద్, స్వర్ణ శేషయ్య, నర్వనేని పుల్లారావు, మర్రి నరసింహారావు, శీలం శెట్టి భూపతిరావు, కళ్యాణపు నరేష్, దుద్దుకూరి సుమంత్, ఉన్డెల వెంకటశ్వర్లు, వందనం సత్యనారాయణరావు, అల్లాడి లింగారావు, భూక్య అనిల్, ఆంగోత్రి శ్రీనివాసరావు, భ్యూ దీక్ష, రావూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా కారణంగా ఆశ్రమానికి భక్తులెవ్వరూ రావోద్దు…!

Satyam NEWS

యశస్తోరణం

Satyam NEWS

నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ కు దర్శనం

Satyam NEWS

Leave a Comment