40.2 C
Hyderabad
May 2, 2024 17: 46 PM
Slider ఖమ్మం

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ.

#Minister Puvvada

ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.ఖమ్మం నగరం 18వ డివిజన్ శ్రీరాం నగర్ రోడ్ నెం.5 లో రూ.కోటి తో నిర్మించనున్న CC డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. 31వ డివిజన్ గ్రైన్ మార్కెట్ ఎదురుగా రూ.70 లక్షలతో నిర్మించనున్న CC సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.33వ డివిజన్ గాంధీ నగర్ లో రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరాభివృద్ధి నా బాధ్యత, కర్తవ్యం అని అన్నారు. ఖమ్మం నగరం అభివృద్ధిలో రాష్ట్రంలో ముందంజలో ఉందని, ఇంకా చేపట్టాల్సిన అనేక పనులు ఉన్నాయని, నా మదిలో అనేక కొత్త ఆవిష్కరణలు, కొత్త పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు.

వాటన్నిటిని పూర్తి చేయాలంటే మళ్ళీ ప్రభుత్వంకు తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పటికే నగర స్వరూపాన్ని మర్చేశామని ఇంకా మిగిలి ఉన్నది కూడా పూర్తి చేస్తే తన బాధ్యత నెరవేరుతుందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధిని సమానంగా తీసుకెల్లామని అన్నారు. కేవలం గోళ్లపాడు మురుకి కాల్వ అభివృద్ది కోసమే రూ.100 కోట్లతో అభివృద్ది చేశామని అన్నారు.

మున్నేరు పై ఎప్పుడో బ్రిటిష్ వారు మున్నేరు పై నిర్మించిన బ్రిడ్జి శిధిలావస్థకు చేరిందని, ముఖ్యమంత్రి కేసీఅర్ చొరవతో అక్కడ రూ. 180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని ఇది ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు.ఇంటింటికీ కళ్యాణలక్ష్మీ, ఆసరా పెన్షన్ చెక్కులు ఇచ్చామని, ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధమైన త్రాగునీరు ఇస్తున్నామని పేర్కొన్నారు.

Related posts

ప్రొఫెసర్ సాయిబాబాకు సరైన వైద్యం అందించాలి

Satyam NEWS

రామతీర్థం కొండపై రాముని విగ్రహం ధ్వంసం..!

Satyam NEWS

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి

Bhavani

Leave a Comment