31.2 C
Hyderabad
May 3, 2024 00: 45 AM
Slider ముఖ్యంశాలు

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన ఉండాలి

#surabhi

ఎన్నికల విధుల పట్ల అధికారులు పూర్తి అవగాహన కల్గిఉండాలని ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్, ఖమ్మం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభి అన్నారు. భారత ఎన్నికల సంఘం, ఢిల్లీ నుండి తెలంగాణ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల విధులపై సందేహాల నివృత్తి కొరకు చేపట్టిన సమావేశంలో మునిసిపల్ కమీషనర్, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ తో కలిసి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల విధులు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టాల్సి ఉంటుందన్నారు. సందేహాల నివృత్తి కొరకు ఎన్నికల సంఘం చేపట్టిన ఆన్లైన్ సెషన్ సద్వినియోగం చేసుకొని, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు.

కార్యక్రమంలో జాతీయ స్థాయి మాస్టర్ శిక్షకులు సయ్యద్ నసీర్ జమీల్ తదితరులు నామినేషన్లు, నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు, వివిధ అనుమతుల మంజూరు, పోలింగ్ రోజు ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్, సువిధ, ఎన్కోర్, ఓట్ల లెక్కింపు విధానం పై వివరిస్తూ, సందేహాలను నివృత్తి చేస్తూ, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవోలు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, తహశీల్దార్లు, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎలక్షన్ సూపరింటెండెంట్ రాంబాబు, ఇడిఎం దుర్గాప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల విడుదల

Bhavani

శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్ లో కరోనా

Satyam NEWS

ప్రభుత్వ లక్ష్యాలు వెంటనే పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment