33.7 C
Hyderabad
April 28, 2024 01: 04 AM
Slider తూర్పుగోదావరి

కాకినాడ కలెక్టరేట్ వద్ద మాజీ సైనికుడు ఆమరణ నిరాహార దీక్ష

#kakinada

దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి సైనికుడిగా పని చేశారు. పదవి విరమణ పొందిన తర్వాత ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించింది అయితే తనకు భూమి అప్పగించ లేదని తక్షణమే 5 ఎకరాలకు భూమి కి డిపట్టా ఇవ్వాలని  మాజీ సైనికుడు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆమరణ నిరాహార దీక్షచేపట్టారు.

వివరాల్లోకి వెళితే కాకినాడకు చెందిన తలారి డేవిడ్ రాజ్ కుమార్ (ఎక్స్ సర్వీస్ మెన్) మిలటరీలో పనిచేసినందుకు

ఆయనకు ఎక్స్ సర్వీస్మెన్ కోటా లో 1987లో గొల్లప్రోలు మండలం ఎ.మల్లవరంలో 5 ఎకరాల భూమి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

అయితే తనకు భూమిని అప్పగించ లేదని తక్షణమే సదరు భూమిని సర్వే చేయించి డి-పారం పట్టా ఇప్పించాలని లేనియెడల తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైనా ఐదెకరాల డ్రై భూమి లేక 2.5 ఎకరాల వెట్ భూమి ఇప్పించాలని ప్రధాన డిమాండ్ చేశారు.

Related posts

ఆర్జీవీతో కలిసి “మా ఇష్టం” అంటున్న టిఆరెస్

Satyam NEWS

శ్రీకృష్ణ సత్యభామ రూపిణీ సమేత కళ్యాణం

Satyam NEWS

ఛత్రపతి శివాజీ సాక్షిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణం

Satyam NEWS

Leave a Comment