26.2 C
Hyderabad
October 15, 2024 12: 43 PM
Slider జాతీయం

ఛత్రపతి శివాజీ సాక్షిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణం

udhav thakre

అత్యంత నాటకీయ పరిణామాల అనంతరం ఏర్పడిన మూడు పార్టీల కూటమి నాయకుడు, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొద్ది సేపటి కిందట ప్రమాణ స్వీకారం చేశారు. ముంబయిలోని శివాజీ పార్క్‌ వేదికగా ఉద్దవ్‌ థాకరేతో  గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొషియారీ ప్రమాణం చేయించారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్నది.

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ఎంపీ సుప్రియా సూలె, అజిత్‌ పవార్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, టీఆర్‌ బాలు, ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే, కాంగ్రెస్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, మల్లికార్జున ఖర్గే, కపిల్‌ సిబల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, పలువురు నేతలు, కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు మహారాష్ట్ర తొలి కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Related posts

9 ఏళ్లకే దశాబ్ది ఉత్సవాలా?

Satyam NEWS

కొండ్రావుపల్లి కాలువలో మునిగిపోయిన యువకుడు

Satyam NEWS

ఈత సరదా విషాదం కాకూడదు

Satyam NEWS

Leave a Comment