29.2 C
Hyderabad
October 10, 2024 18: 29 PM
Slider తెలంగాణ

మాజీ ఎమ్మెల్సీ కేఆర్ అమోస్ ఇక లేరు

k r Amos

తెలంగాణ కోసం మొట్టమొదటి  సారి ప్రభుత్వ ఉద్యోగం తొలగించబడ్డ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కేఆర్ అమోస్ ఇక లేరు. అనారోగ్యంతో ఆయన మల్కాజ్ గిరి లోని తన నివాసంలో మరణించారు. ఉద్యమ కారణంగా దేశంలోనే ఉద్యోగం కోల్పోయిన  మొదటి వ్యక్తి అమోస్. 1969 లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన అమోస్ ను అప్పటి ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ప్రస్తుతం ఆయన మృతదేహం విష్ణు ప్రియ కాలనీ కోదండరామ్ ఆలయం దగ్గర మల్కాజ్ గిరి ఉంది. సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రముఖ తెలంగాణ వాది,  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ   కెఆర్ ఆమోస్ మృతిపట్ల మంత్రి కేటీ రామారావు తీవ్ర సంతాపం ప్రకటించారు. 1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి నడిపించిన ఆయన తర్వాతి దశాబ్దాల్లోనూ తన పోరాటాన్ని కొనసాగించారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఆమోస్ చేసిన సేవలను మంత్రి కేటీఆర్ గుర్తు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాటు,  తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల పైన సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఆయన నిరంతరం గళమెత్తుతూ ఉండేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. తెలంగాణ సమాజానికి ఆమోస్ చేసిన సేవలు ఎల్లకాలం గుర్తు ఉంటాయని ఆయన మృతి తెలంగాణ కి తీరని లోటన్నారు. ఆమోస్ గారి కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

Related posts

వరంగల్‌లో యువకుడి దారుణ హత్య

Satyam NEWS

అక్షర భారత్ విద్యా ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికి విద్య

Satyam NEWS

అభినందన్ ను చిత్రహింసలు పెట్టిన ఖాన్ హతం

Satyam NEWS

Leave a Comment