Slider ఆదిలాబాద్

సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ

seetaram naik

భారత దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన,శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో సోమవారం మహబూబాబాద్ మాజీ ఎంపీ.సీతారాం నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. తన మనుమరాలు విద్మయి కి అమ్మవారి సన్నిధిలో ఆలయ పూజారి మదన్ దీక్షిత్ తో అక్షరాభ్యాసం చేయించారు కుటుంబ సభ్యులు.

అనంతరం ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో అమ్మవారి హారతిని ఇచ్చి తీర్థప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాజీ ఎంపీ, సీతారాం నాయక్ మాట్లాడుతూ చదువుల తల్లిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి, వేములవాడ, బాసర ఆలయ అభివృద్ధి లాగే అనుబంధ దేవాలయాలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, రానున్న రోజుల్లో మళ్ళీ టిఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జ్  పి.ఆర్.ఓ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైకోర్టులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ఊరట

Satyam NEWS

రండి సినిమా ధియేటర్లలోనే సినిమా చూద్దాం

Satyam NEWS

మేడిపల్లి మండల తహసీల్దార్‌గా ఎం.మహిపాల్‌రెడ్డి

Satyam NEWS

Leave a Comment