25.2 C
Hyderabad
October 15, 2024 11: 19 AM
Slider నిజామాబాద్

ఆదర్శ గ్రామాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు

panchayati

కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండలంలోని రాజులా గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధికారి నరేష్ సోమవారం సందర్శించారు. ఎన్జీటీ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆదర్శ గ్రామాలుగా బిచ్కుంద మండలంలోని రాజుల్లా ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం రాజంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామాలను ఎంపిక చేసిందన్నారు.

ఈ గ్రామాలలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత మరుగుదొడ్డి నిర్మాణం తప్పనిసరి అని తడిచెత్త పొడిచెత్త వేరు చేయడానికి ప్రత్యేక బుట్టలను అందిస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు చేతులకు వేసుకోవడానికి గ్లౌజులు కాళ్లకు తోడుకోవడానికి బూట్లను కూడా అందిస్తామన్నారు. ఈ ఎన్జిటి కార్యక్రమం ద్వారా సుమారు పది లక్షల నిధుల వరకు గ్రామానికి వస్తాయని ఆయన అన్నారు. గ్రామ పంచాయితీ కూడా నిధులు కేటాయించవలసి ఉంటుందన్నారు.

గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్ స్థలాన్ని కేటాయించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. ఇప్పటికే డంప్ యార్డు ఉండటం వలన తడిచెత్త పొడిచెత్త వేరు చేసే ప్రాంతాన్నికి భూమిపూజ చేశారు. ఒక్క ఇంటి నుండి ఒక కిలో చెత్తను ప్రతిరోజూ స్వీకరిస్తే గ్రామాల్లో గల నాలుగు వందల కుటుంబాలకు ఒక్క రోజుకు నాలుగు క్వింటల చెత్త వస్తుందన్నారు.

దీంతో చక్కటి ఎరువును తయారు చేసుకుని పంట పొలాలకు వాడుకోవడానికి ఈ చెత్త ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కావున గ్రామంలోని ప్రతి ఒక్కరూ గ్రామ పారిశుద్ధ్యానికి ప్రత్యేక సహకారం అందించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి అధికారులే కాకుండా ప్రజలు కూడా పూర్తి సహయ సహకారాలు  అందిస్తే గ్రామాభివృద్ధి సులభమవుతుందని స్పష్టం చేశారు.

దోమలు లేని గ్రామంగా రాజులను తీర్చిదిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారితో పాటు ఎన్జీటి కోర్డినేటర్ శంకర్ మండల పరిషత్ అధికారి మహబూబ్, సర్పంచ్ చంద్రభాగ ఉపసర్పంచ్ హనుమంతరావు మాజీ జడ్పిటిసి సాయిరాం, నూకల రాజు, పంచాయతీ కార్యదర్శి పండరి, గ్రామ రెవెన్యూ అధికారి పరమేష్ కారోబారీ హనుమంతు తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

రెండు మాసాలు…ఆరు చైన్ స్నాచింగ్ లు.. పోలీసుల అదుపులో “ఒకే ఒక్క‌డు”!

Satyam NEWS

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిపై ఫోక్సో కేసు

Satyam NEWS

లాల్ గడి మలక్ పేట్ లో అర్బన్ ఫారెస్టు పార్క్

Satyam NEWS

Leave a Comment