28.7 C
Hyderabad
May 14, 2024 23: 21 PM
Slider విజయనగరం

నిన్న 50 కుటుంబాలు…తాజాగా 20 కుటుంబాలు..వైఎస్సార్సీపీ లో చేరిక…

#kolagatla

అదీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సమక్షంలో…!

జగన్ ప్రభుత్వం…చెప్పి నట్టుగానే..రెండో సారి.. అదీ రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని పూర్తి గా మార్చేసి..కొత్త వారిని తీసుకున్నారు. అందులో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల కు డిప్యూటీ స్పీకర్ పదివి వరించింది. ఈ క్రమంలో…. ఎమ్మెల్యే కోలగట్ల నియోజకవర్గంలో పలువురు వైఎస్సార్సీపీ పై ఆసక్తి కనబరచి…ఎమ్మెల్యే సమక్షంలో చేరుతున్నారు.

నిన్న యాభై కుటుంబాలు…తాజాగా ఇరవై కుటుంబాలు..ఎమ్మెల్యే సమక్షంలో నే అధికార పార్టీలో చేరారు..సీఎం జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తూ, ప్రభుత్వ విధానాలు నచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.

ఈ మేరకు నగరంలోని 25వ డివిజన్ గాడి కానాకు చెందిన తెలుగుదేశం పార్టీ మరియు ఇతర పార్టీకి చెందిన సానుభూతిపరులు   తాళ్లపూడి కృష్ణ, తాళ్లపూడి జయలక్ష్మి, పొట్నూరు గౌరీ శంకర్రావు, కామవరపుపేట లక్ష్మణరావు, భోగి సంతోష్, తాళ్లపూడి రాజు, తాళ్లపూడి మనోహర్ ల  ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరికి ఎమ్మెల్యే కోలగట్ల కండువాలు కప్పి , పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ  నేటి నుంచి వీరు వైఎస్సార్ కుటుంబ సభ్యుల నీ, డివిజన్లో అందరూ సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

సీఎం జగన్ నేతృత్వంలో పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులు విస్మరించడంతో, కరోనా  సమయంలో   బంగ్లాకు తాళాలు వేసుకోవడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనీ , అయోమయ పరిస్థితులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , సీఎం జగన్ నేతృత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు.

పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు గౌరవం పెరిగే విధంగా తమ ప్రవర్తన ఉంటుందన్నారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

ఓట్లు వేసే ప్రజలకు అండగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం  కృషి  చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. నగర పార్టీ అధ్యక్షులు ఆసపు వేణు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇంచార్జ్ బోడసింగి ఈశ్వరరావు, డివిజన్ పార్టీ నాయకులు ఎడ్ల రాజేష్, బలివాడ కాశీపతిరావు, గొట్టుముక్కల మురళి, పాండ్రంకి రమణ, వీర్రాజు, సతీష్, రామ్ లాల్, వెంకటరెడ్డి తదితరులున్నారు.

Related posts

ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం

Murali Krishna

ఎటెన్షన్: ఎన్నికల కమిషనర్ కు కేంద్ర భద్రత కల్పించాలి

Satyam NEWS

రాహుల్ కు వచ్చే ఎన్నికల్లో పోటీకి అర్హత ఉంటుందా?

Satyam NEWS

Leave a Comment