33.7 C
Hyderabad
April 29, 2024 01: 14 AM
Slider ముఖ్యంశాలు

విఆర్ఎ ల ఉద్యమానికి సి ఐ టి యు సంపూర్ణ మద్దతు

#citu

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు, కార్మికులు,ఉద్యోగులు,నిరుద్యోగులు సామాన్యులు సైతం పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం లేక బాధపడుతున్నారని,ఇది బంగారు తెలంగాణ కాదని,బాధల తెలంగాణ అని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని విఆర్ఎ లు తమ సమస్యలపై చేస్తున్న నిరవధిక నాలుగో రోజు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఫలితం వచ్చేంతవరకు పోరాటం చేయాలని,2020 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా విఆర్ఎ లని రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేస్తారని ప్రకటించి నేటికీ రెండు సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకపోవడం అన్యాయమని శీతల రోషపతి అన్నారు.సుమారు 23 వేల మంది విఆర్ఎ లు రోడ్డున పడుతున్నారని,గ్రామాలలో రెవెన్యూ ప్రభుత్వం ఆదాయానికి కీలక భూమి పోషిస్తున్న విఆర్ఎ లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. కెసిఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనలేదని,రానున్న కాలంలో ప్రభుత్వం పతనం తప్పదని రోషపతి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్క సోమయ్య గౌడ్,ఉపతల వెంకన్న,విఆర్ఎ ల మండల అధ్యక్షుడు పి.వీరబాబు,నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్,చెన్నయ్య,ఈదయ శ్రీనివాస్,సునీల్,నాగమ్మ,ఖాసిం,రంజాన్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మంగళగిరి కోర్టులో లొంగిపోయిన అచ్చెంనాయుడు

Satyam NEWS

నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు కృషి చేస్తా

Satyam NEWS

భారంగా ఉన్నారని కూతుళ్ళ విక్రయం

Satyam NEWS

Leave a Comment