33.7 C
Hyderabad
April 27, 2024 23: 09 PM
Slider ముఖ్యంశాలు

ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం

#telangana

ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బడ్జెట్‌ ఆమోదం కోసం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌..ఆ  ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోదముద్ర వేసింది. అయితే, మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సొంత ఇళ్ల స్థలాలు ఉండి.. ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేబినెట్‌ చర్చించే అవకాశముంది. ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. ఈ అంశానికి సంబంధించి.. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.

Related posts

చర్చలు సఫలం: పెరిగిన రైస్ మిల్ దిన కూలి రేట్లు

Bhavani

జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక ఆరంభం

Satyam NEWS

ఐదున్నర కోట్లు ఆర్జించిన పవర్ స్టార్ చిత్రం

Satyam NEWS

Leave a Comment