39.2 C
Hyderabad
April 30, 2024 22: 30 PM
Slider జాతీయం

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. కేంద్ర నిర్ణయంపై మమత

దేశ సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ అధికార పరిధిని మరింత విస్తృతం చేస్తూ కేంద్ర హోం శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దీంతో ఇకపై పంజాబ్‌, పశ్చిమ బెంల్​, అసోం రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కి.మీ.వరకు లోపలకు వచ్చి బీఎస్ఎఫ్ దళాలు సోదాలు, జప్తులు చేయడం సహా అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయవచ్చు.

గతంలో ఇది 15 కి.మీ వరకు మాత్రమే ఉండేది. దేశ భద్రత బలోపేతానికి, డ్రగ్స్ అక్రమ రవాణాను నిలువరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్రం హోం శాఖ తీసుకున్న నిర్ణయానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ  నిర్ణయం దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

Related posts

నిత్యావసర సరుకులు పంచిపెట్టిన ఆశ్య ఫౌండేషన్

Satyam NEWS

అకస్మాత్తుగా తిరుపతి ప్రచారానికి వస్తున్న సిఎం జగన్

Satyam NEWS

శానిటైజర్ తాగి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యయత్నం

Satyam NEWS

Leave a Comment