30.7 C
Hyderabad
April 29, 2024 03: 10 AM
Slider జాతీయం

కేరళలో భారీ పేలుడు: ఒకరు మృతి.. పలువురికి గాయాలు

#keraladgp

కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రేయర్‌ మీట్‌ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వరపుజ, అంగమలి, ఎడపల్లి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం 9.20కి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా అక్కడున్నవారు…భయాందోళనకు గురై హాలు నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక, పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు.

Related posts

సింహాచలం భూములపై కన్నేసి కుట్ర చేస్తున్నారు

Satyam NEWS

ఎంపీపీని సస్పెండ్ చేయాలి: రెడ్డి ఐక్య వేదిక డిమాండ్

Satyam NEWS

మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు ఆగాలి

Satyam NEWS

Leave a Comment