31.7 C
Hyderabad
May 2, 2024 07: 15 AM
Slider ఖమ్మం

కంటి వెలుగు ను వినియోగించుకోవాలి

#Eye light

న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది కంటి పరీక్షల సౌకర్యార్ధం జిల్లా కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయ మూర్తి డాక్టర్ టి. శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి సందర్శించారు. కంటివెలుగు శిబిరంలో ప్రధాన న్యాయ మూర్తి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

అంధత్వ నివారణ చర్యల కై ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పధకంను జిల్లా ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయ మూర్తి ప్రజలకు తెలిపారు.

అనంతరం జిల్లా ప్రధాన న్యాయ మూర్తి రచించిన మోడరన్ లీగల్ సిస్టం అను పుస్తకం ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎన్. సంతోష్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, కె. ఆశారాణి, ఎన్. శాంతి సోని, పి. మౌనిక, ఆర్. శాంతి లత, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి సూర్యనారాయణ, నాజర్ కె. రాధేశ్యామ్, సాంకేతిక అధికారి ఎస్. ఓంకార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. మాలతీ, డా. నంద్యాల బాలకృష్ణ, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు రద్దు

Satyam NEWS

సేఫ్టీ ఫస్ట్: గ‌నుల‌లో భ‌ద్ర‌త పై స‌మావేశం

Satyam NEWS

ప్రభుత్వ వైఫల్యమే మణిపూర్ ఘటన

Bhavani

Leave a Comment