38.2 C
Hyderabad
April 29, 2024 13: 52 PM
Slider నల్గొండ

రైస్ మిల్లుల యాజమాన్యం కార్మిక సమస్యలపై చర్చించటానికి ఆహ్వానించాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అన్ని ట్రేడ్ యూనియన్ ల అనుబంధ సంఘ నేతలు, రైస్ మిల్లుల డ్రైవర్స్ యూనియన్ కార్మికులు బుధవారం తమ జీతాల డిమాండ్ మూడవ నోటీసు రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులకు అందజేశారు.

ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు,కార్మికులు మాట్లాడుతూ జి.ఓ.ప్రకారం వేతనాలు పెంచాలని,సెక్షన్ కు నలుగురు డ్రైవర్లను నియమించాలని, సర్వీసు 30 రోజుల వేతనంగా ఇవ్వాలని, సంవత్సరానికి 60 రోజులు బోనస్ ఇవ్వాలని,సంవత్సరానికి బట్టల నిమిత్తం నాలుగువేల రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 18 రోజులు సెలవు దినాలు, రిపబ్లిక్ డే,బక్రీద్ పండుగలకు సెలవులు ఇవ్వాలని,సంవత్సరానికి సైకిల్ ఎలవెన్సులు వెయ్యి రూపాయలు ప్రకటించాలని, మెడికల్ అలవెన్సులు వెయ్యి రూపాయలుగా,వాషింగ్ అలవెన్సులు 500 రూపాయలుగా,టి బత్తా పగలు 30 రూపాయలు,రాత్రి 30 రూపాయలు ఇవ్వాలని,ప్రతి ఒక్క కార్మికుడికి ఈఎస్ఐ,పిఫ్ తప్పనిసరిగా అమలు చేయాలన్న డిమాండ్ తో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష్య,కార్యదర్శులకు మూడవ నోటీసుని అందజేశారు.

లిఖితపూర్వకముగా ఇచ్చిన  డిమాండ్లను చర్చించుటకు చర్చలకు రైస్ మిల్ యాజమాన్యం తమని పిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి, టిఆర్ఎస్ కెవి నియోజకవర్గ కార్మిక సంఘ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను,ఐ ఎన్ టి సి జిల్లా కార్యదర్శి జానయ్య,     టి ఎన్ టి యు నాయకులు ఆకం కోటేశ్వరావు,కొప్పెర లాలయ్య,కొండపల్లి వెంకన్న,రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్   అధ్యక్ష్య,కార్యదర్శులు పోలిశెట్టి నరసింహారావు,కోటేశ్వరరావు,ప్రభాకర్, అప్పారావు,పట్టణ టిఆర్ఎస్కెవి అధ్యక్షుడు చింతకాయల మల్లయ్య, వివిధ యూనియన్ల రైస్ మిల్ డైవర్స్ అధ్యక్ష్య, కార్యదర్శులు సైదులు,వెంకన్న,ఎర్రయ్య, చింతకాయల రాము,నాగరాజు,శ్రీను, లాలయ్య,కోటేశ్వరరావు,పర్వతాలు, తిరపయ్య కార్మికులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

త్వ‌ర‌లో ల‌క్షమందితో స‌భ నిర్వ‌హిద్దాం… బ్రాహ్మ‌ణులంటే ఏమిటో చూపిద్దాం

Satyam NEWS

వృద్ధులకు దుప్పట్లు పంచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

విహార యాత్ర కాదు విజ్ఞాన యాత్ర

Bhavani

Leave a Comment