39.2 C
Hyderabad
May 3, 2024 14: 59 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రసూతి సౌకర్యం పెంచండి

#dsrtrust

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు సౌకర్యాలు పెంచాలని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కోరారు. ఈ మేరకు ఆయన ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. మొదటి కాన్పు డెలివరీ ఇక్కడే చేయాలని, మూడువ కాన్పు ఆపరేషన్లు కూడ చేయాలని, ఆసుపత్రిలో 24 గంటలు గర్భిణీ స్త్రీలకు డాక్టరు అందుబాటులో ఉండి వైద్యం అన్ని రకాలుగా అందించాలని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం గర్భిణీ స్త్రీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో డెలివరీ చేయాలని, ప్రోత్సాహకరంగా కెసిఆర్ కిట్ ఇస్తుందని,కానీ హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఆపదలో ఉన్న గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకపోవడం చాలా అమానుషమని ఆయన అన్నారు.

నియోజకవర్గంలో పేరుకే వంద పడకల వైద్యశాల గా మారిందని ఆయన అన్నారు. గర్భణీ మహిళలు డెలివరీ కోసం వస్తే డాక్టర్లు సరైన వైద్యం అందించలేని పరిస్థితి ఉందని,ఏమైనా అంటే దూర ప్రాంతాల వైద్యశాలలకు పంపడం,దూర ప్రాంతాలకు వేళ్ళలేక దిక్కుతోచని స్థితిలో ప్రవేటు వైద్యశాలలో వేల రూపాయలు ఫీజులు కట్టి చూపించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అందరికీ పూర్తి స్థాయిలో ఇక్కడే డెలివరీలు చేయాలని నియోజకవర్గ ప్రజల తరుపున విన్నవించుకుంటున్నామని, లేని పక్షంలో పై స్థాయి వైద్య అధికారులకు ఫిర్యాదు చేస్తామని,ఉన్నతాధికారులు స్పందించకుంటే బాధితులతో కలిసి ఉద్యమం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

“అడుగుల సవ్వడి”..పుస్తకావిష్కరణ..

Satyam NEWS

హెల్ప్ ద నీడీ: మానవత్వాన్ని నిద్రలేపుతున్న కరోనా

Satyam NEWS

కరోనా వారియర్ ఎస్సై బ్రహ్మం కు రివార్డు ప్రధానం

Satyam NEWS

Leave a Comment