29.7 C
Hyderabad
May 2, 2024 05: 58 AM
Slider మహబూబ్ నగర్

ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి ఫ్యాన్లు విరాళం

#donation

పంజగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దారమేని గణేష్ ఫ్యాన్లు అందించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామపంచాయతీ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు రానున్నది వేసేవి కాలం కావడంతో ఉక్కపోతకు గురికాకుండా ఉండాలని ఉద్దేశంతో ఫ్యాన్ లు అందజేశారు. ఈ సందర్భంగా దారమేని గణేష్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు ఫ్యాన్లు లేక ఉడకపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఫ్యాన్ కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. గ్రామంలో విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం, గ్రామ అభివృద్ధి పట్ల తను ఎప్పుడూ చిత్తశుద్ధితో ముందుకు వస్తానని తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ అంజి యాదవ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏ ఎన్ ఎం సుజాత డాక్టర్ భాగ్యలక్ష్మి ఆశా వర్కర్స్ అరుణ యాదమ్మ మహిళా సమైక్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే

Satyam NEWS

కారా మాస్టారూ… మమ్మల్ని వదిలి ఎలా వెళతారు?

Satyam NEWS

బంజారా హిల్స్ లో ప్యుర్ ఓ నాచురల్ ను ప్రారంభించిన సుచిత్ర ఎల్లా

Satyam NEWS

Leave a Comment