28.7 C
Hyderabad
May 6, 2024 10: 11 AM
Slider కడప

దోస పంట సాగు చేసిన రైతులను ఆదుకోవాలి

farmers 271

కడప జిల్లాలో దోస పంట సాగుచేసిన రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం పాత కడప పొలం పల్లె గ్రామాల్లో దోస పంటను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ కడప నగరంలోని పాత కడప చెరువు క్రింద పాలెం పల్లె, పాత కడప,మోడమీద పల్లి గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 500 ఎకరాల్లో దోస పంట సాగు చేశారన్నారు.

ఎకరాకు 20000 పెట్టుబడి పెట్టిన రైతులకు కరోనా రావడంతో ప్రభుత్వం విధించిన జనతా కర్ఫ్యూ లాక్ డౌన్ వల్ల రవాణా పూర్తిగా స్తంభించిపోయి చేతికొచ్చిన దోస పంటను పొలంలోనే వదిలేసి కోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రతి ఏటా ఈ ప్రాంతానికి చెందిన రైతులు శరభత్ రకానికి చెందిన దోస పంట సాగు చేసి చెన్నై రాష్ట్రంలోని ఈరోడ్, సేలం, బెంగళూరు తీసుకుపోయి అమ్ముకునే వారని అన్నారు.

ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు చెందిన మార్కెట్లో పూర్తిగా బంద్ పాటించడం వల్ల వ్యాపారులు ముందుకు రాక పంటను పొలంలోనే వదిలేస్తున్నారు అన్నారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి కొనుగోలుకు సహకరించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రతి ఏటా అకాల వర్షాలు దోస పంటను పొట్టన పెట్టుకునేవనీ కానీ ఈ ఏడాది అలాంటివేవీ రాకపోవడంతో దిగుబడి కూడా బాగా పెరిగిందన్నారు. కరోనా రాకపోయి ఉంటే ఎకరాకు ఖర్చులు పోను 50000 మిగిలే దన్నారు కానీ దెబ్బకు పెట్టుబడి కూడా చేతికి రాక దోస పంట రైతాంగం భారీగా నష్టపోయింది అన్నారు.

ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి పెట్టుబడి సహాయాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం నాయకులు టి మనోహర్ రెడ్డి, దాది రెడ్డి భాస్కర్ రెడ్డి, పి.చంద్రశేఖర్ రెడ్డి, దేవగుడి శేఖర్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, నలవ ల శ్రీనివాసులరెడ్డి, పవన్ కుమార్, కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు.

Related posts

మహబుబ్ నగర్ లో అధునిక కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్

Satyam NEWS

భారీ వర్షాలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

Bhavani

ఎమ్మెల్యే దేవిరెడ్డి ఆశీర్వాదం తీసుకున్న సుంకోజు

Satyam NEWS

Leave a Comment