40.2 C
Hyderabad
May 2, 2024 16: 38 PM
Slider నల్గొండ

రబి వరి పంట వేసుకోవడానికి రైతులకు స్వేచ్ఛనివ్వాలి

#cpihujurnagar

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆర్ డి ఓ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రైతులతో ఆర్ డి ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రబీలో వరి పంటపై అధికారులు,ప్రభుత్వం చేస్తున్న పత్రికా ప్రకటనలపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. తక్షణమే ఆయకట్టు రైతుల పట్ల పత్రికా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆయకట్టులో వరి తప్ప మరే ఇతరమైన ఎలాంటి పంటలు వేయలేరని అన్నారు.

ఖరీఫ్ పంట రైతులు కోతలు కోస్తున్నారని,పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఖరీఫ్ పంటను కొనుగోలుకు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని,గన్ని బ్యాగ్స్ లేవని,మిల్లర్లు స్థలం లేదని రకరకాల సాకులతో పంట కొనుగోలుకు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మ్యాచ్యర్ పేరుతో,తూకంలో మోసం చేస్తున్నారని,సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, యల్లావుల రాములు,యల్లావుల రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కంబాల శ్రీనివాస్, గుండు వెంకటేశ్వర్లు,దేవరం మల్లేశ్వరి, పట్టణ కార్యవర్గ సభ్యులు జక్కుల రమేష్, జడ వెంకన్న, గుండెబోయిన వెంకన్న, మామిడి వెంకయ్య,నూతల వీరబాబు, మాదాల గోవిందు,దొంతగాని సత్యనారాయణ,ఉస్తెల బాబు,మంగయ్య, కారింగుల లింగయ్య,కుడితోట్టి సావిత్రి,దేవరం సుజాత,కంచర్ల నర్సిరెడ్డి, రాములు,యం.వెంకన్న,వెంకట నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఏపి భవన్ ప్రత్యేక కమిషనర్ రమణారెడ్డి

Satyam NEWS

అయిజ తిరుమల్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

మృతుని కుటుంబానికి రంగినేని పరామర్శ

Bhavani

Leave a Comment