26.7 C
Hyderabad
May 3, 2024 10: 45 AM
Slider హైదరాబాద్

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

#governmentschool

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతానని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. శనివారం ఉప్పల్ డివిజన్ లోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను శనివారం ఉప్పల్ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి  ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్  అరుణ కుమారి,  మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ఎస్. ఎస్ .ప్రసాద్, ఎంఈఓ శశిధర్, పంచాయతీరాజ్ డిఇ వేణుగోపాల్, ఏ ఈ స్పూర్తి , ఉప్పల్ మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివానంద్ ,నిఖిల్ రెడ్డి, జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయురాలు  జి. ఎలిజబెత్ డేవిడ్ లతో  కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ ఉన్నత  పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కనీస వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.

పాఠశాలను సందర్శించి పరిశీలించిన అనంతరం  త్వరలో నియోజకవర్గ నిధులతో కావాల్సిన పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం  పాఠశాలలో కొన్ని మార్పులు, మరమ్మత్తులు చేసుకోవడం, ఆధునీకరణ కు అనుగుణంగా  విద్యార్థులను  అహ్లాదపరిచేందుకు, వారి మానసిక స్థైర్యాన్ని పెంచే విధంగా ఉండాలని సూచించారు. పాఠశాల ని పూర్తిగా సందర్శించి మధ్యాహ్న భోజనం పథకం కింద సన్న బియ్యం పిల్లలకు ఇచ్చే భోజన సదుపాయం మెనూ లను పరిశీలించారు.

పిల్లలకు వేరువేరుగా టాయిలెట్లు గదుల నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సహకారంతో హరితహారం లో భాగంగా చెట్లు నాటాలని మేడ్చల్ జిల్లా విద్యాధికారి ఎన్ ఎస్ ఎస్ ప్రసాద్  గ్లోబల్ స్కాలర్ ఫౌండేషన్ వారు బెస్ట్ సర్వీసెస్ అవార్డును గోవాలో ప్రధానం చేసినందుకుగాను ఎమ్మెల్యే  ప్రధానోపాధ్యాయులుని అభినందించి శాలువాతో సత్కరించారు. 

కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్ ,  ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు మేకల మధుసూదన్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, మస్కట్ సుధాకర్, ఐలేష్, శ్రీకాంత్, వెంకటరెడ్డి, మైసయ్య, వెంకటేష్, పంగ మహేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి  మల్లేష్ సంపత్, పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు జంగమ్మ, నాగేశ్వరరావు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు , మున్సిపల్ సిబ్బంది,  స్థానిక వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజకీయ లబ్ది కోసమే రైతులతో సమావేశాలు

Satyam NEWS

టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా నరేష్ రెడ్డి

Satyam NEWS

కరోనా హెల్ప్: దత్తత గ్రామంలో నిత్యావసరాలు పంచిన సీపీ

Satyam NEWS

Leave a Comment