ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫిషియో కమిషనర్ గా నియమితులైన ఎన్ వి రమణారెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఐ ఆర్ పి ఎస్ (1986)బ్యాచ్ అధికారి అయిన ఎన్.వి.రమణారెడ్డి ఇండియన్ రైల్వే లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రోటోకాల్ విభాగం సెక్రటరీగా ,సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వే లో ని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ విభాగంలోపనిచేస్తూ తిరిగి డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఎన్. వి. రమణారెడ్డి ని న్యూఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్ ,ఎక్స్ అఫీషియో కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది . ఈ మేరకు గురువారం రమణారెడ్డి బాధ్యతలను స్వీకరించారు.
previous post