42.2 C
Hyderabad
May 3, 2024 15: 15 PM
Slider వరంగల్

పేదల పట్టాలపై వాలుతున్న భూ రాబందులు

#MuluguRDO

పేదల పట్టా స్థలాలను ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులను కట్టడి చేయాలని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నేతలు ములుగు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

వెంకటాపురం ఎస్సీ ఎస్టీ బిసి రైతులు గత 30 సంవత్సరాలుగా కాస్తు చేసుకొని పంట పండిస్తున్నారు. అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేసి కొంతమంది దళారులు భూ కబ్జాదారులు వెంకటాపూర్ ఎమ్మార్వో వీఆర్వో తో కుమ్మక్కై దొంగ పట్టాలు చేసుకున్నారని వారు ఆరోపించారు.

అనర్హులకు పట్టాలు చేయడం సిగ్గుచేటని అఖిలపక్ష కన్వీనర్ ముంజలు భిక్షపతి గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జన్ను రవి మాదిగ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరిగింది.

అనంతరం ఆర్ డి ఓ కు వినతి పత్రం ఇచ్చారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పేద రైతులు 30 సంవత్సరాలుగా కాస్తు లో ఉన్న కూడా అర్హులైన రైతులకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.

దళారులకు పట్టాలిచ్చిన ఎమ్మార్వో వీఆర్వో లను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చెయ్యకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బిక్షపతి అన్నారు.

ఈ ధర్నా కార్యక్రమంలో వెంకటాపూర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కడప క శ్యాం మాదిగ న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బొమ్మెర సాంబయ్య సిపిఎం పార్టీ వెంకటాపూర్ మండల అధ్యక్షులు రెడ్డి రామస్వామి వివో డబ్బులు పాల్గొన్నారు.

ఇంకా మహిళా సంఘం అధ్యక్షురాలు బొమ్మ లక్ష్మి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బోడ రఘు మంద అనిల్ సరోజన సమ్మక్క సారక్క తదితర రైతులు మహిళలు నాయకులు కూడా పాల్గొన్నారు.

Related posts

వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తున్నారు

Satyam NEWS

మానవత్వం చాటిన జనచైతన్య ట్రస్ట్

Bhavani

కాంగ్రెస్ లో చేరిన సదాశివనగర్ వైస్ ఎంపీపీ

Satyam NEWS

Leave a Comment