32.7 C
Hyderabad
April 26, 2024 23: 23 PM
కవి ప్రపంచం

తెలుగు జాతి రత్నం

#Giddi Venkata Ramana

దేశం  గర్వించదగ్గ గొప్ప వ్యక్తి

ప్రధాని పదవిని నిర్వహించిన పాములపర్తి

భారత రాజకీయాలలో తిరుగులేని శక్తి

ప్రజానేత గా సంపాదించాడు కీర్తి!!

భూమి లేని నిరుపేదలకు భూమి నిచ్చి

భూసంస్క రణ ల చట్టాన్ని అమలు చేశాడు

మంత్రి గా ఏ శాఖ ను చేపట్టిన

పదవికే వన్నె తెచ్చిన ప్రజా సేవకుడు!!

విదేశాంగశాఖ  కేంద్ర మంత్రిగా

విశ్వశాంతి కోసం కృషి చేశాడు

మాన వ  వనరుల   శాఖ ను చేపట్టి

విద్యా రంగం లో మార్పులు తెచ్చాడు!!

క్షీణ దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ను

ప్రధానిగా మెరుగు  పరిచాడు

పారిశ్రామిక విధానానికి ప్రాణం పోసి

ఆర్థిక సరళీకరణ కు పునాది వేశాడు!!

వేయపడగలను హిందీ లోకి అనువదించి

అనువాదకుడు గా పేరు పొందాడు

తన జీవితాన్ని ప్రతిబింబించే విధంగా

ఇన్సైడర్ గ్రంధాన్ని రచించాడు!!

బహు భాషా కోవిదుడు గా,మహామేధావి గా

ప్రజల ప్రశంసలు అందుకున్న నాయకుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి గా, ప్రజా సేవకుడిగా

జనం హృదయాలలో నిలిచిన వాడు!!

ఆచార్య గిడ్డి వెంకట రమణ, చర వాణి 9440984416

Related posts

ప్రకృతికి ప్రణామం

Satyam NEWS

కాలచక్రం

Satyam NEWS

చిరుకాంక్ష

Satyam NEWS

Leave a Comment