33.7 C
Hyderabad
April 30, 2024 01: 14 AM
Slider ముఖ్యంశాలు

ఆస్ట్రేలియాలో మహానేత కెసిఆర్ హరిత జన్మదిన వేడుకలు

austrelia kcr

కెసిఆర్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా లోని సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండీగో, బల్లార్ట్ నగరాలలో TRS ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అధ్వర్యం లో ఘనంగా జరిగాయి. అందరూ ఒక్కొక్క మొక్క నాటి హరిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

రాజేష్ రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీ లో కెసిఆర్ దీర్ఘాయుష్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా అన్న దాన కార్యక్రమాలు చేసి అభిమానుల మధ్య  జన్మదిన  వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. TRS ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడిన మహానాయకుడు కెసిఆర్ అన్నారు.

చావు అంచులకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న కెసిఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. రవి యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సాయిరాం ఉప్పు, రవి సాయల అధ్వర్యం లో అడిలైడ్ , బ్రిస్బేన్, మెల్బోర్న్, కాన్బెర్రాలో వేడుకలు నిర్వహించారు.

రవీందర్ చింతామణి, రవి శంకర్ ధూపాటి, లక్ష్మణ్ నల్లాన్, పరశురామ్ ముతుకుల, సంగీత ధూపాటి, జస్వంత్ కొడారపు, ప్రకాష్ హనుమంత, వరుణ్ నల్లెల్ల, సాంబ శివ రెడ్డి, అజాజ్ మొహమ్మద్, గుల్షన్, స్మ్రితి రోహిత్ తదితరులు వేడుకలలో పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్: ప్రీ పెయిడ్‌ ప్లాన్ కాల పరిమితి పొడిగించండి

Satyam NEWS

కొల్లాపూర్ చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి ప్రచార యాత్ర

Satyam NEWS

“ఆహా”లో “ఊరెళ్ళిపోతా మామ” అనూహ్య విజయం

Satyam NEWS

Leave a Comment