28.7 C
Hyderabad
April 27, 2024 04: 19 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఇసుకతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు

y s jagan america

వచ్చే నెల 5వ తేదీ  నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువకే ఇసుక అందుబాటులోకి తీసుకు రావాలని ఆయన జిల్లా కలెక్టర్లకు చెప్పారు. ఇసుక సరఫరాను పెంచాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇసుక విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారని జగన్‌ అధికారులతో వ్యాఖ్యానించారు. స్పందన కార్యక్రమం ద్వారా వస్తున్న వినతులు, సమస్యలను సత్వరం పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  ప్రభుత్వ సంక్షేమ ఫథకాలు అర్హులకే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్లస్థలాలకు సంబంధించి ఎండార్స్‌మెంట్‌ ఇస్తున్న పద్ధతి మరింత మెరుగుపడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో ప్రజల నుంచి వస్తున్న వినతులు ఇళ్లస్థలాలకు సంబంధించినవేనని.. సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిఎం చెప్పారు. మండలాలవారీగా గ్రామ, వార్డు వాలంటీర్లతో లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్లు సీఎంకు తెలిపారు. గ్రామ వాలంటీర్లను పాత్ర చురుగ్గా ఉండేలా చూసుకోవాలని.. వారందరికీ త్వరగా స్మార్ట్‌ ఫోన్లు అందించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలతో కలెక్టరేట్ల అనుసంధానానికి యాప్‌ తయారీపై కూడా సీఎం ఆరా తీశారు. త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

పలు సంక్షేమ పథకాల అమలుపై సీఎం స్పష్టత ఇచ్చారు. వివరాలు: 1,సెప్టెంబర్‌ చివరి వారంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేలు. 2.అక్టోబర్‌ 15న రైతు భరోసా పథకం ప్రారంభం3. పడవలు, బోట్లు ఉన్నవారికి రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయం. 4.నవంబర్‌ 21న మత్స్యదినోత్సవం సందర్భంగా పథకం అమలు. 5.లీటర్‌ డీజిల్‌పై ఉన్న రూ.6 సబ్సిడీని రూ. 9కి పెంచబోతున్నాం. 6.మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి డిసెంబర్‌ 21న రూ. 24 వేలు. 7.జనవరి 26న అమ్మఒడి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తాం. 8.ఫిబ్రవరి చివరివారంలో నాయీ బ్రాహ్మణులు, షాపులున్న టైలర్లు, రజకులకు రూ. 10 వేలు అందజేస్తాం. 9.ఫిబ్రవరి చివరి వారంలో ‘వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక’ ఇవ్వబోతున్నాం. 11.ఉగాది నాటికి ఇల్లు లేని నిరుపేదలకు స్థలాల పట్టాలు పంపిణీ చేస్తాం. 12.అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయించాం. సెప్టెంబర్‌ నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Related posts

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఏలోపింగ్ టీచర్: ఆమెకు 26 అతనికి 14 లేచిపోయారు

Satyam NEWS

వాట్సాప్ ద్వారా ఫోరం ఫర్ నీట్ 10 గ్రాండ్ టెస్ట్స్,కీ

Satyam NEWS

Leave a Comment