37.2 C
Hyderabad
April 26, 2024 20: 14 PM
Slider కవి ప్రపంచం

దేహపు పంజరం

#sri shanti mehar

తెల్లవార వస్తుంది

నిన్నటి కలే మళ్ళీ తరిమినట్లుగా

అదే ఛాయ

ఆ మాయా రాత్రికి నీ తలపే

ఊపిరి పోసింది.

మచ్చిక కాని ఊహల్లో విహరిస్తూ

ఓడిపోయిన దిగుళ్ళను పక్కకు

నెడుతూ..

ఎన్నో క్షణాలు ముని వేళ్ళతో

లెక్కగట్టాను.

నా మనసంతా నీదన్నాను.

నువ్వు నా జాడే తెలీదన్నావు.

ఈ హృదయం ముక్కలుగా

విడిపోయిన క్షణం అది.

నీ తేనియ కలలన్నీ రక్తం చిందిస్తూ

ఊపిరి సలపనీయని రాత్రి అది

ఏకాంతం ఈ దేహపు పంజరం

లోంచి ఎగిరిపోయిన రోజు

చంద్ర బింబం కుంకుమ వర్ణం

పూసుకున్న క్షణం అది

నిన్ను ఆదరించలేక దూరంగా

తరమలేక నిశ్చలంగా నిలబడిపోయి

నేను..

శ్రీశాంతి మెహర్

Related posts

శ్రీశైలంలోని కమ్మ సత్రంలో ఒకరిని కొట్టి చంపిన యాత్రీకులు

Satyam NEWS

రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి… తొడలు కొట్టుకోవడానికి కాదు

Satyam NEWS

నారా లోకేష్ స‌మ‌క్షంలో టిడిపిలో చేరిక‌

Satyam NEWS

Leave a Comment