పొరపాటున మంచులో పడిపోయిన భారత సైనికోద్యోగి ఒకరు జారుతూ జారుతూ పోయి పాకిస్థాన్ భూభాగంలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. 2002లో భారత సైన్యంలో చేరిన డెహ్రాడూన్‌లోని అంబీవాలా సైనిక కాలనీకి చెందిన రాజేంద్ర సింగ్ ను కశ్మీరులోని శీతల ప్రాంతమైన గుల్మార్గ్‌కు బదిలీ చేశారు.
కాగా జనవరి 8న నేగి భార్య రాజేశ్వరికి ఆయన కనపడటం లేదంటూ భారత సైన్యం నుంచి సమాచారం వచ్చింది. ప్రమాదవశాత్తూ మంచులో జారిపడిన ఆయన భారత సరిహద్దును దాటి పాక్‌వైపు భూభాగంలోకి ప్రవేశించినట్టు అధికారులు అనుమానమ్ వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఆందోళనకు గురైన రాజేంద్ర సింగ్ నేగి కుటుంబసభ్యులు ఆయనను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలను చేపట్టవలసిందిగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హవల్దార్ నేగిని వెతికి, రక్షించే కార్యక్రమం చేపట్టామని సైనికాధికారులు తెలిపారు. ఆయనను క్షేమంగా తిరిగి తీసుకురావటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వారు హామీ ఇచ్చారు.