నిజమైన జర్నలిస్టులకు కలమే బలం బలహీనత అని TUWJ ( IJU ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ అన్నారు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పరితపించే పాత్రికేయు లందరికీ ఆయన జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా(నేషనల్ ప్రెస్ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక దేశం లో ప్రజాస్వామ్యం సక్రమం గా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశం లో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగం మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యం అమలవు తుంటే ఆ దేశం లో ప్రజాస్వామ్య పాలనకు , చట్టబద్దపాలనకు ఢోకాలేనట్టే నని ఆయన అన్నారు.
previous post