28.7 C
Hyderabad
May 6, 2024 07: 41 AM
Slider నల్గొండ

శ్రమజీవుల హక్కులను హరించాలని చూసే కేంద్రంపై సమరం

#CITUHujurnagar

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేకంగా వివిధ రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి వ్యవసాయ కార్మిక సంఘం ఐక్య పోరాటాలకు సమైక్యం కావాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కార్మికులు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల స్థాయి గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికుల విస్తృత స్థాయి సమావేశం ఇరుగుల సత్యనారాయణ అధ్యక్షతన అనంతగిరి గ్రామ శివారులో జరిగింది.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మల్టీ పర్పస్ విధానం జీవో నెంబర్ 51 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

శ్రమజీవుల హక్కులను హరించే విధంగా 44 చట్టాలను 4 కోడ్ లు గా మార్చటం కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, లేకుంటే కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వంపై సమరం చెయ్యాల్సి వస్తుందని అన్నారు.

కరోనా టైంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు కష్టపడుతున్న వారందరికి అదనంగా వేతనం ఇవ్వాలని కోరారు. కనీసం నెలకి వేతనం 18000 రూపాయలు, అర్హులైన కార్మికులకు డబల్ బెడ్ రూములు ఇవ్వాలని కోరారు.

సి ఐ టి యు జిల్లా సహాయ కార్యదర్శి సోమపంగు రాధాకృష్ణ, యలక సోమయ్య గౌడ్ మాట్లాడుతూ సిఐటియు సుదీర్ఘ పోరాటం ఫలితంగా గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు 8500 రూపాయలు సాధించడం జరిగిందని అన్నారు.

కార్మికుల హక్కుల కోసం నిరంతరం సి ఐ టి యు పోరాటం చేస్తుందని అన్నారు. సమావేశం ఏకగ్రీవంగా ఢిల్లీలో 11 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా తీర్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సి ఐ టి యు నాయకులు బచ్చల కూరి స్వరాజ్యం,హనుమంతు, లింగయ్య, సురేష్ ,విజయ్, వీరబాబు,శివరాం, శ్రీను, పద్మ, సుశీల, గోవిందు, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ లో ఆక్రమ నిర్మాణాలపై కొరడా

Satyam NEWS

చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో తీవ్ర అస్వస్థత

Satyam NEWS

ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలు అందజేసిన సైబరాబాద్ సీపీ

Sub Editor

Leave a Comment