29.7 C
Hyderabad
May 1, 2024 09: 22 AM
Slider ముఖ్యంశాలు

బియ్యం చుట్టూ తిరుగుతున్న కారు కమలం కయ్యం

#cmkcr

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు ‘ వడ్లు ‘ కేంద్రంగా తిరుగుతున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రధాన అంశంగా అధికార తెరాస, ప్రతిపక్షాలు భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ లో పండిన 100 శాతం ధాన్యం కేంద్రప్రభుత్వం కొనాల్సిందే నని, కొనకుంటే తీవ్ర ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

కేంద్రం పంజాబ్, హర్యానాలలో ఒక రీతిగా, మిగిలిన రాష్ట్రాలలో వేరే రీతిగా వ్యవహరించడం సమంజసం కాదని ఆయన అన్నారు. పంజాబ్ లో వంద శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లే తెలంగాణలో కూడా కొనాలని సీఎం డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర ఇస్తున్నది ధాన్యానికే బియ్యానికి కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పండిన వరి కేంద్రం కొనాలని, ఈ విషయమై మంత్రులు, ఎంపీలు కేంద్ర ఆహార మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తారని…ఒక వేళ సమ్మతించనట్లయితే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ అన్నారు.

ధాన్యం సేకరణకు జాతీయ విధానం ఉండాలి

అలాగే… ధాన్య సేకరణకు జాతీయ విధానం ఉండాలని, దేశంలో రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించే దిశగా అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తామని ఆయన తెలిపారు. దేశ ఆహార భద్రత విషయంలో రాజ్యాంగబద్ధమైన విధిని కేంద్రం నెరవేర్చాలని తెలంగాణ సీఎం డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా… ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ వాదన మరోలా ఉంది. ఇటీవల తనను కలిసిన తెలంగాణ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ప్రస్తుత యాసంగి సీజన్ కు సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముడి బియ్యం ఎంతైనా కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ ఇచ్చిన తర్వాత కేవలం రాజకీయ లబ్దికోసం కేసీఆర్భా జపా ను బద్నాం చేయడం పనిగా పెట్టుకున్నారని పీయూష్ గోయల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా బియ్యం కొనుగోలు చేసినట్లే తెలంగాణ లో కూడా ముడి బియ్యం కొని, రైతులను ఆదుకుంటామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.

రైతులను వేధిస్తునన కేసీఆర్: బిజెపి వాదన

అసలు గతంలో ఇస్తామన్న బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చారు.
యసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులపై కక్షసాధింపు చర్యగా కొత్త డ్రామా ఆడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కేవలం బ్రోకరిజం అని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని…మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన సమాచారం తన దగ్గర ఉందని ఆయన అన్నారు.

ధాన్యం సేకరణ అంశంలో తెరాస ప్రభుత్వానికి ఒక అంచనా, విధివిధానాలు లేవని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తమతో చెప్పారని సంజయ్ తెలిపారు. ఇక మరో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదే అంశంపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో అటు కేంద్రప్రభుత్వం ..ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ వాదన మరో రకం

కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ లో అమలుచేస్తున్న మాదిరిగా ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రైతు బంధు పథకంతో రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరగదని, పంటలకు అందించే మద్దతు ధరలకు అదనంగా అందించే బోనస్ తో లబ్ది చేకూరే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు వివరించారు.

రైతుల నుంచి ధాన్యం ఎలా కొనాలో తాము చూపిస్తామని జాతీయ కిసాన్ వైస్ చైర్మన్ కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వానికి చేతకాకపోతే కాంగ్రెస్ పార్టీకి రూ.10 వేల కోట్లు ఇస్తే , ప్రతి గింజ కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పారు. త్వరలో గ్రామ, మండల,జిల్లా కేంద్రాలలో రైతుల పక్షాన నిరసనలు చేస్తామన్నారు. భవిష్యత్తులో వేలాది మంది రైతులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కేంద్రంపై వత్తిడికి కేసీఆర్ ఎత్తుగడ

తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా సకల రాజకీయ పార్టీల ప్రతినిధుల బృందం ఢిల్లీ కి వెళ్లి , కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేయాలని తెలంగాణ సమాజం ఆశిస్తోంది. అభిలషిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు ‘ వడ్లు ‘ కేంద్రంగా తిరుగుతున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రధాన అంశంగా అధికార తెరాస, ప్రతిపక్షాలు భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ లో పండిన 100 శాతం ధాన్యం కేంద్రప్రభుత్వం కొనాల్సిందే నని, కొనకుంటే తీవ్ర ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

వంద శాతం ధాన్యం కొనుగోలు చేయాలి

కేంద్రం పంజాబ్, హర్యానాలలో ఒక రీతిగా, మిగిలిన రాష్ట్రాలలో వేరే రీతిగా వ్యవహరించడం సమంజసం కాదని ఆయన అన్నారు. పంజాబ్ లో వంద శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లే తెలంగాణలో కూడా కొనాలని సీఎం డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర ఇస్తున్నది ధాన్యానికే బియ్యానికి కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పండిన వరి కేంద్రం కొనాలని, ఈ విషయమై మంత్రులు, ఎంపీలు కేంద్ర ఆహార మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తారని…ఒక వేళ సమ్మతించనట్లయితే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ అన్నారు.

అలాగే… ధాన్య సేకరణకు జాతీయ విధానం ఉండాలని, దేశంలో రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించే దిశగా అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తామని ఆయన తెలిపారు. దేశ ఆహార భద్రత విషయంలో రాజ్యాంగబద్ధమైన విధిని కేంద్రం నెరవేర్చాలని తెలంగాణ సీఎం డిమాండ్ చేశారు.

కేంద్రం వాదన మాత్రం మారలేదు

ఇదిలా ఉండగా… ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ వాదన మరోలా ఉంది. ఇటీవల తనను కలిసిన తెలంగాణ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ప్రస్తుత యాసంగి సీజన్ కు సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముడి బియ్యం ఎంతైనా కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ ఇచ్చిన తర్వాత కేవలం రాజకీయ లబ్దికోసం కేసీఆర్ బిజెపిని బద్నాం చేయడం పనిగా పెట్టుకున్నారని పీయూష్ గోయల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా బియ్యం కొనుగోలు చేసినట్లే తెలంగాణ లో కూడా ముడి బియ్యం కొని, రైతులను ఆదుకుంటామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.

అసలు గతంలో ఇస్తామన్న బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చారు.
యసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులపై కక్షసాధింపు చర్యగా కొత్త డ్రామా ఆడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కేవలం బ్రోకరిజం అని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని…మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన సమాచారం తన దగ్గర ఉందని ఆయన అన్నారు. ధాన్యం సేకరణ అంశంలో తెరాస ప్రభుత్వానికి ఒక అంచనా, విధివిధానాలు లేవని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తమతో చెప్పారని సంజయ్ తెలిపారు.

రైతుల్ని మోసం చేస్తున్న టీఆర్ఎస్, బిజెపి

ఇక మరో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదే అంశంపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో అటు కేంద్రప్రభుత్వం ..ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ లో అమలుచేస్తున్న మాదిరిగా ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

రైతు బంధు పథకంతో రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరగదని, పంటలకు అందించే మద్దతు ధరలకు అదనంగా అందించే బోనస్ తో లబ్ది చేకూరే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు వివరించారు.
రైతుల నుంచి ధాన్యం ఎలా కొనాలో తాము చూపిస్తామని జాతీయ కిసాన్ వైస్ చైర్మన్ కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వానికి చేతకాకపోతే కాంగ్రెస్ పార్టీకి రూ.10 వేల కోట్లు ఇస్తే , ప్రతి గింజ కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పారు. త్వరలో గ్రామ, మండల,జిల్లా కేంద్రాలలో రైతుల పక్షాన నిరసనలు చేస్తామన్నారు. భవిష్యత్తులో వేలాది మంది రైతులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా సకల రాజకీయ పార్టీల ప్రతినిధుల బృందం ఢిల్లీ కి వెళ్లి , కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేయాలని తెలంగాణ సమాజం ఆశిస్తోంది. అభిలషిస్తోంది.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

చెట్టుపై నుంచి పడ్డ కల్లుగీత కార్మికుడికి ఆర్ధిక సాయం

Satyam NEWS

చైనాలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు…..

Satyam NEWS

పుస్తకాలతో మేధో సంపద పెరుగుతుంది

Satyam NEWS

Leave a Comment