30.7 C
Hyderabad
April 29, 2024 04: 00 AM
Slider నల్గొండ

పుస్తకాలతో మేధో సంపద పెరుగుతుంది

#BookInauguration

పుస్తకాలు విజ్ఞాన సంపదలని, వాటిని నిత్యం పఠిస్తే మేధో సంపద పెరుగుతుందని స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి అన్నారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం రోజున కనకదుర్గ ఆవరణలో జర్నలిస్ట్ పెద్ది నరేందర్ సంకలనతో రూపొందించిన మున్సిపల్ సెల్ ఫోన్ డైరెక్టరీ ని ఆవిష్కరించిన అనంతరం  ఆయన మాట్లాడుతూ పుస్తక సమాచారం మానవునిలో ఉన్న అజ్ఞానాన్ని మేలు కొలుపుతుందని, సమాజాన్ని సంఘటితం చేయడానికి ఉపయోగ పడతాయని అన్నారు.

రోజు కొంత సమయాన్ని పుస్తకాలు చదువు కోవడానికి ఉపయోగించు కోవాలని సూచించారు. పట్టణంలోని అన్ని రంగాలకు చెందిన వ్యక్తుల సెల్ నెంబర్లతో కూడిన డైరెక్టరీని తయారు చేసిన జర్నలిస్ట్ నరేందర్ ను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కాంగ్రేస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య, కౌన్సిలర్లు పందిరి గీత,  కోనేటి కృష్ణ, రేమిడాల లింగస్వామి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు నూనె వెంకటస్వామి, కూరేళ్ల శ్రీను, నాగిరెడ్డి, జిట్టా బొందయ్య, సిలివేరు శేఖర్, వరకాంతం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆజాదీకా అమృత్ మహోత్సవ్: రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రీడమ్ వాక్

Satyam NEWS

ఈ వారం పోలీసు”స్పందన”కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా…?

Satyam NEWS

రాజాసింగ్ కు బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment