26.7 C
Hyderabad
May 3, 2024 10: 19 AM
Slider నల్గొండ

పేదవాడిని చూడకుండా పెద్దవాడికి సాయం చేస్తున్న నిర్మలమ్మ

#roshapati

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ సిలిండర్ల ధరల కారణంగా వలన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. వీటి ధరలు తగ్గించే ప్రయత్నం చేయకుండా రెండవ ఉద్దీపన పేరుతో బడా పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మళ్లీ మేలు చేస్తున్నారని ఆయన అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల రామాపురం గ్రామంలో కృష్ణ పట్టి ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సమావేశంలో కార్మికులతో రోషపతి మాట్లాడుతూ గడిచిన ఏడు సంవత్సరాలకు పైగా సిమెంటు పరిశ్రమలలో ఏజ్ బోర్డు ప్రకారం వేతనాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,కానీ సిమెంటు పరిశ్రమలో సిమెంటు ధరలను పెంచేందుకు పరిశ్రమల యాజమాన్యానికి సహకరించిందని అన్నారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులలో పిఎఫ్,ఈఎస్ఐ కొన్ని పరిశ్రమలు కట్టకుండా కార్మికులని అన్యాయం చేస్తుందని విమర్శించారు. రిటైర్మెంట్ అయిన కార్మికులకు వారికి రావాల్సిన అలవెన్సులు,పింఛన్ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేసినారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఐక్య పోరాటాలు చేసేందుకు సమైక్యం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు తీగెల శ్రీను,అజరుద్దీన్, అంకారావు,సైదారావు,నాగేశ్వరరావు వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం జడ్పీ చైర్మన్ శ్రీను నివాసంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

ఫుడ్ బిజినెస్ లోకి ప్రవేశించిన ఆనంద్ దేవరకొండ

Satyam NEWS

21న ఖమ్మం కు చంద్రబాబు

Murali Krishna

Leave a Comment