32.2 C
Hyderabad
May 1, 2024 23: 57 PM
Slider పశ్చిమగోదావరి

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఫైనాన్సర్

#rapecase

ఫైనాన్సర్ అయితే వ్యాపారం చేసుకోవాలి కానీ రేప్ లు చేస్తాడా? మామూలుగా అయితే ఏమో కానీ ఏలూరు జిల్లా లో మాత్రం ఫైనాన్సర్ తన వ్యాపారం తాను చేసుకోకుండా ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. జిల్లాలోని ఒక మండల కేంద్ర పరిధిలో ఉన్న ఒక గ్రామం లో ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ బాలిక ఈ అఘాయిత్యానికి బలైపోయింది. మైనర్ బాలిక పై అఘాయిత్యం జరిగితే పోలీసులు తక్షణ సాయం చేయాలి. సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి కటకటాల వెనుక పడేయాలి. అయితే ఏలూరు జిల్లా పోలీసులు మాత్రం అలా చేయడం లేదు.

ఫైనాన్సర్ కదా అతనితో బేరం ఆడుతున్నారు. అత్యాచారం చేయడమే నేరమైతే ఆ నేరాన్ని దాచేందుకు ప్రయత్నం చేస్తున్నవారు చేస్తున్నదేమిటి? ఇదే ప్రశ్న ఏలూరు జిల్లా వాసులంతా వేస్తున్నారు. ఒక ఫైనాన్స్ వ్యాపారి అహంకారం తో బరితెగించి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు గురువారం గుప్పుమన్నాయి. సదరు ఫైనాన్స్ వ్యాపారికి వివాహమై ఇరువురు ఆడపిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇంత వయసు వచ్చిన ఆడపిల్లల తండ్రి అయ్యి ఉండి కూడా అదే గ్రామం లో  ఇంటర్ చదువుతున్న  విద్యార్థి పై అత్యాచారానికి తెగబడ్డాడన్న సమాచారం పై మండల ప్రజలు మండిపడుతున్నారు. ఫైనాన్సర్ పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గతం లో ఇదే ఫైనాన్సర్  అత్యాచారాలకు పాల్పడ్డాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్లో ఇతని పై అత్యాచార కేసులు కూడా నమోదు చేశారు. గురువారం నాడు బాధిత బాలిక బంధువులు తెలిపిన సమాచారం మేరకు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనాన్సర్ ని సంబంధిత పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అయితే కొంతమంది

పలుకుబడి ఉన్న పెద్దలు ఈ కేసు నమోదు కాకుండా సెటిల్ మెంట్ కుదర్చడానికి పెద్ద ఎత్తున ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. పోలీసులు కూడా అందుకు లొంగిపోతున్నట్లు చెబుతున్నారు. అయితే బాధిత ఇంటర్ విద్యార్థి బంధువులు సెటిల్ మెంట్ కి ససేమిరా కుదరని తెగేసి చెప్పుతున్నట్టు సమాచారం. ఫైనాన్సర్ పై కేసు నమోదు చేయాల్సిందేనని పట్టుపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బాలిక బంధువులు రాజీకి రానందున ఫైనాన్సర్ పై ఉన్న పాత అత్యాచార కేసులను కూడా పరిగణలోకి తీసుకుని కొత్త కేసు నమోదు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Related posts

కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు ఐక్యంగా పోరాటం

Satyam NEWS

విత్తన శుద్ధి వల్ల రైతులకు మేలైన ప్రయోజనం

Satyam NEWS

అగ్లీ సీన్స్: అనుచితంగా ప్రవర్తించిన మంత్రులు

Satyam NEWS

Leave a Comment